KCR: తిమ్మాపూర్ వెంకన్న ఆలయానికి కేసీఆర్ ఎంత ప్రకటించారో తెలుసా...
ABN , First Publish Date - 2023-03-01T14:46:52+05:30 IST
జిల్లాలోని తిమ్మాపూర్ వెంకటేశ్వరస్వామి ఆలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు.
కామారెడ్డి: జిల్లాలోని తిమ్మాపూర్ వెంకటేశ్వరస్వామి ఆలయం (Thimmapur Venkateswara Swamy Temple)లో ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు (Chief Minister KCR couple) ప్రత్యేక పూజలు చేశారు. ఈరోజు ఉదయం ఆలయానికి చేరుకున్న సీఎం దంపతులకు ఆలయ పూజారులు, స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి (Speaker Pocharam Srinivas Reddy) కుటుంబ సభ్యులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవంలో కేసీఆర్ దంపతులు పాల్గొన్నారు. ఆపై తిమ్మాపూర్ కృతజ్ఞత సభలో పాల్గొన్న కేసీఆర్ తిమ్మాపూర్ వెంకటేశ్వరస్వామి ఆలయ అభివృద్ధికి రూ.7 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆనాడు పాలకులు కర్కశంగా వ్యవహరించారని సీఎం మండిపడ్డారు. కరువుతో నిజామాబాద్ (Nizamabad) జిల్లా ప్రజలు అల్లాడారని తెలిపారు.
తాను తెలంగాణ (Telangana) ఉద్యమానికి పోయే సమయంలో నిజాంసాగర్ ప్రాజెక్టు సమస్య ఒకటన్నారు. తెలంగాణ వచ్చాక అన్నీ సాధించుకున్నామని చెప్పారు. తానున్నన్ని రోజులు పోచారం ఉండాల్సిందే అని.. బాన్సువాడ (Banswada)ప్రజలకు సేవ చేయాల్సిందే అని స్పష్టం చేశారు. సీఎం ప్రత్యేక అభివృద్ధి నిధుల నుంచి బాన్సువాడ నియోజకవర్గానికి రూ.50 కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించారు. కాళేశ్వరం పథకం ద్వారా నిజాంసాగర్ ఎప్పుడూ కళకళలాడుతూనే ఉంటుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
ప్రాణం ఉన్నంత వరకు మా నాయకుడు కేసీఆరే
అంతకుముందు పోచారం మాట్లాడుతూ.. కొండపై స్వామి వారి ఆలయం అద్భుతంగా రూపు దిద్దుకోవడానికి కారణం కేసీఆర్ (CM KCR) అన్నారు. కేసీఆర్ (Telangana CM) ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో కరవు లేదని తెలిపారు. పంటలు బ్రహ్మాండంగా పండుతున్నాయన్నారు. గోదావరి జలాలతో నిజాంసాగర్ ప్రాజెక్టు (Nizamsagar project) కళకళ లాడుతోందని చెప్పుకొచ్చారు. బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధికి రూ.1200 కోట్లు ఇచ్చారన్నారు. 11000 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు కట్టామని తెలిపారు. వెంకటేశ్వరస్వామి ఆలయానికి 66 ఎకరాలు కేటాయిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చాయని అన్నారు. ప్రాణం ఉన్నంత వరకు తమ నాయకుడు కేసీఆర్ అని స్పష్టం చేశారు. దేశ ప్రజలు కేసీఆర్ రాక కోసం ఎదురు చూస్తున్నారని పోచారం పేర్కొన్నారు.