CM Revanth: గొప్ప వ్యక్తి సభకు స్పీకర్ అయ్యారు
ABN , Publish Date - Dec 14 , 2023 | 11:16 AM
Telangana: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎన్నికకు మద్దతు తెలిపిన బీఆర్ఎస్, ఎంఐఎం, సీపీఐ సభ్యులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ కుమార్ పేరును ప్రోటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ సభలో అధికారికంగా ప్రకటించారు.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎన్నికకు మద్దతు తెలిపిన బీఆర్ఎస్, ఎంఐఎం, సీపీఐ సభ్యులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ధన్యవాదాలు తెలిపారు. స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ కుమార్ (TS Assembly SPeaker Gaddam Prasad Kumar) పేరును ప్రోటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ (Protem Speaker Akbaruddin Owaisi)సభలో అధికారికంగా ప్రకటించారు. స్పీకర్‌కు ఎమ్మెల్యేల అభినందనల అనంతరం స్పీకర్‌కు ధన్యవాదాల తీర్మానంపై సభ్యులు మాట్లాడారు. ముందుగా ముఖ్యమంత్రి రేవంత్ సభలో మాట్లాడుతూ.. మంచి సాంప్రదాయానికి అందరూ మద్దతు తెలిపారని.. భవిష్యత్‌లో కూడా ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు. గడ్డం ప్రసాద్ తన సొంత జిల్లా నేత అని తెలిపారు. వికారాబాద్‌కు ఎంతో విశిష్టత ఉందన్నారు. వికారాబాద్ గుట్ట వైద్యానికి పెట్టింది పేరన్నారు. సమాజంలో ఎన్నో రుగ్మతలకు గడ్డం ప్రసాద్ పరిష్కారం చూపుతారని ఆశిస్తున్నట్లు తెలిపారు. గొప్ప వ్యక్తి సభకు స్పీకర్ అయ్యారని కొనియాడారు. కింది స్థాయి నుంచి స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ ఎదిగారన్నారు. వికారాబాద్ అభివృద్ధిలో గడ్డం ప్రసాద్ ది చెరగని ముద్ర అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.