Traffic Diversion Alert : నేడు సీఎం ఇఫ్తార్‌ విందు..ఏఏ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలంటే..

ABN , First Publish Date - 2023-04-12T11:56:56+05:30 IST

రాత్రి 9 వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. వాహనాల పార్కింగ్‌ వివరాలను ఆయన వెల్లడించారు. ట్రాఫిక్‌ మళ్లింపులు, పార్కింగ్‌ ప్రదేశాలు(Parking Places), వాహనాలు వెళ్లాల్సిన మార్గాలను తెలిపే మ్యాప్‌ను విడుదల చేశారు.

Traffic Diversion Alert : నేడు సీఎం ఇఫ్తార్‌ విందు..ఏఏ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలంటే..

హైదరాబాద్‌: రంజాన్‌ ఉపవాస దీక్షల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌(Chief Ministers) ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌-ఏ-దావత్‌ కార్యక్రమానికి పోలీసులు భారీ బందోబస్తు చర్యలు చేపట్టారు. ఎల్బీ స్టేడియంలో బుధవారం సాయంత్రం నిర్వహించే ఈ విందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ముస్లిం మతపెద్దలు, పార్టీ కార్యకర్తలతోపాటు నగరంలోని పలు మసీద్‌ల ఇమామ్‌లు, ముస్లిం సోదరులు భారీ సంఖ్యలో హాజరయ్యే అవకాశముంది. స్టేడియం పరిసరాల్లో బుధవారం సాయంత్రం 5 గంటల నుంచే ట్రాఫిక్‌ మళ్లింపులు(Traffic Diversion) చేపట్టనున్నట్లు ట్రాఫిక్‌ అదనపు సీపీ జి.సుధీర్‌బాబు తెలిపారు. రాత్రి 9 వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. వాహనాల పార్కింగ్‌ వివరాలను ఆయన వెల్లడించారు. ట్రాఫిక్‌ మళ్లింపులు, పార్కింగ్‌ ప్రదేశాలు(Parking Places), వాహనాలు వెళ్లాల్సిన మార్గాలను తెలిపే మ్యాప్‌ను విడుదల చేశారు.

traffic-alert1.jpg

ట్రాఫిక్‌ మళ్లింపులు ఇలా..

  • చాపెల్‌రోడ్‌, నాంపల్లి నుంచి బాబూ జగ్జీవన్‌రామ్‌ విగ్రహం వైపు వచ్చే వాహనాలను ఏఆర్‌ పెట్రోల్‌ పంపు వద్ద నుంచి పీసీఆర్‌ (పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌) -వైపు మళ్లిస్తారు.

  • -ఎస్‌బీఐ, గన్‌ఫౌండ్రీ నుంచి ప్రెస్‌క్లబ్‌, బషీర్‌బాగ్‌ ఫ్లైఓవర్‌ వైపు వెళ్లే వాహనాలను ఎస్‌బీఐ పక్క నుంచి చాపెల్‌ రోడ్‌ వైపు అనుమతిస్తారు.

  • రవీంద్రభారతి, హిల్‌ఫోర్ట్‌ రోడ్‌ నుంచి బాబూ జగ్జీవన్‌రామ్‌ విగ్రహం వైపు వెళ్లే వాహనాలను కేఎల్‌కే బిల్డింగ్‌ వద్ద నుంచి సుజాత హైస్కూల్‌

  • వైపు అనుమతిస్తారు.

  • లిబర్టీ వైపు నుంచి బషీర్‌బాగ్‌ ఫ్లై ఓవర్‌ ద్వారా నేరుగా వెళ్లే వాహనాలను బీజేఆర్‌ విగ్రహం వద్ద కుడివైపు అనుమతినివ్వకుండా గన్‌ఫౌండ్రీ, చాపెల్‌రోడ్‌ వైపు నేరుగా అనుమతిస్తారు.

  • నారాయణగూడ సెమెటెరీ, ఓల్డ్‌ ఎమ్మెల్యే క్వార్ట ర్స్‌ నుంచి బషీర్‌బాగ్‌ వైపు వచ్చే వాహనాలను ఓల్డ్‌ ఎమ్మెల్యే క్వార్టర్స్‌ వద్ద నుంచి హిమాయత్‌నగర్‌ వై జంక్షన్‌ వైపు అనుమతిస్తారు.

  • కింగ్‌ కోఠి, బొగ్గులకుంట నుంచి భారతీయ విద్యాభవన్‌ మీదుగా బషీర్‌బాగ్‌ వెళ్లే వాహనాలను కింగ్‌కోఠి క్రాస్‌ రోడ్‌ వద్ద నుంచి తాజ్‌మహల్‌, ఈడెన్‌గార్డెన్‌ వైపు అనుమతినిస్తారు.

  • బషీర్‌బాగ్‌ నుంచి పీసీఆర్‌ వైపు వెళ్లే వాహనాలను అనుమతించకుండా లిబర్టీ వైపు అనుమతిస్తారు.

  • సాధారణ వాహనదారులు, దావత్‌ ఏ ఇఫ్తార్‌ కార్యక్రమానికి వచ్చే అతిథులు ట్రాఫిక్‌ మళ్లింపులను దృష్టిలో ఉంచుకోవడంతో పాటు వాహనాల నుంచి దిగాల్సిన ప్రదేశాలు, పార్కింగ్‌ కేంద్రాలను దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు.

పార్కింగ్‌ కేంద్రాలు

  • ఏ-1 గోల్డ్‌ ఆన్‌ డయాస్‌ పాస్‌ ఉన్న వారు ఎల్‌బీస్టేడియం ఏ గేటు ద్వారా ప్రవేశించి గేట్‌ నెం.17 వద్ద దిగాలి. వాహనాలను టెన్నిస్‌ కోర్టు వద్ద పార్క్‌ చేయాలి.

  • ఏ-1 గోల్డ్‌ రెడ్‌ కలర్‌ టెక్స్ట్‌ ఉన్న వారు ఎల్‌బీస్టేడియం ఏ గేటు ద్వారా ప్రవేశించి మెయిన్‌ రోడ్‌ వద్ద దిగి గేట్‌ నెం.17 ద్వారా ప్రవేశించాలి. వాహనాలను మహబూబియా కాలేజ్‌, ఆలియా కాలేజ్‌, హజ్‌హౌజ్‌లో పార్కింగ్‌ చేయాలి.

  • ఏ-1 గోల్డ్‌ గ్రీన్‌ కలర్‌ టెక్స్ట్‌ ఉన్న వారు ఎల్‌బీస్టేడియం డి గేటు ద్వారా ప్రవేశించి ఎదురుగా మెయిన్‌ రోడ్‌ వద్ద దిగాలి. వాహనాలను నిజాం కాలేజీ గేట్‌ నెం.2 వద్ద పార్క్‌ చేయాలి.

  • ఏ-2 గ్రీన్‌ కలర్‌ పాస్‌ ఉన్న వారు ఎల్‌బీస్టేడియం డి గేటు ద్వారా ప్రవేశించి ఎదురుగా మెయిన్‌ రోడ్‌ వద్ద దిగాలి. వాహనాలను నిజాం కాలేజీ గేట్‌ నెం.2 వద్ద పార్క్‌ చేయాలి.

  • బీ బ్లాక్‌ బ్లూ కలర్‌ పాస్‌ ఉన్న వారు ఎల్‌బీస్టేడియం జి గేటు మెయిన్‌రోడ్దు వద్ద దిగి గేట్‌ నెం. 15 ద్వారా ప్రవేశించాలి. వాహనాలను పబ్లిక్‌ గార్డెన్‌లో పార్క్‌ చేయాలి.

  • సీ బ్లాక్‌ పింక్‌ కలర్‌ పాస్‌ ఉన్న వారు ఎల్‌బీ స్టేడియం ఎఫ్‌, ఎఫ్‌1 గేట్‌ వద్ద దిగి గేట్‌ నెం.6, 8 ద్వారా లోనికి వెళ్లాలి. వాహనాలను నిజాం కాలేజీ గేట్‌ నెం.4 వద్ద పార్క్‌ చేయాలి.

  • మీడియా ప్రతినిధులు డి గేట్‌ ద్వారా లోనికి ప్రవేశించాలి. వాహనాలను ఎస్‌సీఈఆర్‌టీ కార్యాలయం వద్ద పార్క్‌ చేయాలి.

Updated Date - 2023-04-12T11:56:56+05:30 IST