Uttamkumar Reddy: రాజకీయాల నుంచి రిటైర్డ్ అవుతా.. ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-06-02T13:03:32+05:30 IST

రాజకీయాల నుంచి రిటైర్డ్ అవుదామని అనుకుంటున్నట్లు కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Uttamkumar Reddy: రాజకీయాల నుంచి రిటైర్డ్ అవుతా.. ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్: రాజకీయాల నుంచి రిటైర్డ్ అవుదామని అనుకుంటున్నట్లు కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి (Congress MP Uttamkumar reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో ఉత్తమ్ మాట్లాడుతూ.. కమర్షియల్ రాజకీయాలకు తాను సెట్ కానని అన్నారు. ఏదో ఒక మంచిరోజు చూసుకొని రాజకీయాల నుండి రిటైర్డ్ అవుదామని అనుకుంటున్నట్లు తెలిపారు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి వస్తాయని అనుకుంటున్నానని అన్నారు. మోదీ చరిష్మతో ఎన్నికలకు వెళ్దామని బీజేపీ అనుకుంటుందని.. రెండు ఎన్నికలు ఒకేసారి వస్తే కాంగ్రెస్‌కే లాభమని చెప్పుకొచ్చారు. శరత్ రెడ్డి అప్రూవర్‌గా మారితే లిక్కర్ కేసు సీరియస్‌గా టర్న్ అవుతుందన్నారు. శరత్ రెడ్డి నిజంగా అప్రువర్ గా మారితే అది ఆప్‌కు చావుదెబ్బ అని ఎంపీ చెప్పుకొచ్చారు.

వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల (YSRTP Chief YS Sharmila) కాంగ్రెస్‌లోకి వస్తుందో లేదో తనకు తెలియదని.. కాంగ్రెస్ నుంచి ఎవరో పెద్దవాళ్ళు షర్మిలతో మాట్లాడినట్టు అనిపిస్తోందన్నారు. బీజేపీ ఊపు తగ్గుతోందన్నారు. బీజేపీలో ఎవరు మాట్లాడినా సీరియస్‌గా ఆ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని తెలిపారు. బీజేపీలో ఇన్ సైడర్స్ వర్సెస్ అవుట్ సైడర్స్ నడుస్తోందని అన్నారు. 2018 నుంచి రాజకీయాలు చాలా కమర్షియల్‌గా మారాయన్నారు. ఈ కమర్షియల్ రాజకీయాల నుంచి తప్పుకుంటే గౌరవంగా ఉంటుందని అనుకుంటున్నట్లు వెల్లడించారు. 30 సంవత్సరాలు అయ్యాయి కాబట్టి అక్టోబర్‌లోనో, నవంబర్‌లోనో రాజకీయాల్లో నుంచి తప్పుకుంటే బాగుంటుందని అనుకుంటున్నట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పుకొచ్చారు.

Updated Date - 2023-06-02T13:06:36+05:30 IST