V.Hanumantharao: కాంగ్రెస్ అలా చేస్తే కేసీఆర్ ఒప్పుకుంటారా?..

ABN , First Publish Date - 2023-03-01T14:18:02+05:30 IST

భూపాలపల్లిలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్రపై దాడిని మాజీ ఎంపీ వీ.హనుమంతరావు తీవ్రంగా ఖండించారు.

V.Hanumantharao: కాంగ్రెస్ అలా చేస్తే కేసీఆర్ ఒప్పుకుంటారా?..

హైదరాబాద్: భూపాలపల్లిలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy) పాదయాత్రపై దాడిని మాజీ ఎంపీ వీ.హనుమంతరావు (V Hanumantha Rao) తీవ్రంగా ఖండించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీలు సభలు పెట్టొద్దు అంటే ఎలా అని ప్రశ్నించారు. కేసీఆర్ (CM KCR) దగ్గర మెప్పు పొందడానికి గండ్ర వెంకటరమణారెడ్డి (Gandra Venkataramana Reddy) దాడి చేయించారని ఆరోపించారు. బీఆర్ఎస్ (BRS) ఇతర రాష్ట్రాల్లో మీటింగ్‌లు పెడితే ఇలాగే కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేస్తే కేసీఆర్ (Telangana CM) ఒప్పుకుంటారా అని నిలదీశారు. రాళ్లు రువ్వడం, టమాటాలు వేయడం సరైన పద్దతి కాదన్నారు. ఇలాంటి చర్యలు మానుకోక పోతే రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య వస్తుందని తెలిపారు. పార్టీ మారిన గండ్ర వెంకటరమణారెడ్డిపై ప్రజలు తిరగబడే రోజు దగ్గరలోనే ఉందని ఆయన హెచ్చరించారు.

పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. కాంగ్రెస్ (Congress) కార్యకర్తలు తిరగబడడం మొదలైతే బీఆర్ఎస్ తట్టుకోలేదన్నారు. ఈసారి ఇలా జరిగితే పరిస్థితి తమ చేతుల్లో ఉండదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇలాంటి సాంప్రదాయం మొదలు పెడితే సరికాదన్నారు. భూపాలపల్లి సభలో పాల్గొని తిరిగి వెళుతూ చనిపోయిన చందూ నాయక్ మృతికి సంతాపం తెలియజేశారు. నార్సింగ్ కార్పొరేట్ కాలేజీ‌లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి సాత్విక్ (Inter Student Satvik) ఆత్మహత్య దారుణమన్నారు. విద్యార్థుల పట్ల కాలేజీ యాజమాన్యం సున్నితంగా వ్యవహరించాలని సూచించారు. హర్ట్ అయితే విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని... దీన్ని గమనించి కాలేజీ యాజమాన్యాలు నడుచుకోవాలనీ వీహెచ్ హితవుపలికారు.

Updated Date - 2023-03-01T14:18:02+05:30 IST