UttamKumar: ‘నిరుద్యోగ సమస్య పరిష్కారంలో మోదీ, కేసీఆర్ విఫలం’

ABN , First Publish Date - 2023-05-06T14:49:01+05:30 IST

నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో ప్రధాని మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ విఫలమయ్యారని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు.

UttamKumar: ‘నిరుద్యోగ సమస్య పరిష్కారంలో మోదీ, కేసీఆర్ విఫలం’

హైదరాబాద్: నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో ప్రధాని మోదీ (PM Modi), రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) విఫలమయ్యారని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి (Congress MP Uttam kumar reddy) వ్యాఖ్యానించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యోగాలు వస్తాయనే ఆశతో యువత తెలంగాణ కోసం పోరాటం చేశారని.. కానీ రాష్ట్రం వచ్చిన తరువాత కూడా నిరుద్యోగ సమస్య మరింత పెరిగిందన్నారు. గతంలో 25 లక్షలు నిరుద్యోగులు ఉంటే .. ఇప్పుడు 40 లక్షలకు చేరిందని తెలిపారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న కేసీఆర్ (Telangana CM) ఊరుకో ఉద్యోగం కూడా ఇవ్వలేదని విమర్శించారు. ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) నిరుద్యోగులకు అండగా ఉండడానికి వస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ (Congress) అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అక్టోబర్‌లో ఎన్నికల షెడ్యూల్ వస్తే నవంబర్‌లో ఎన్నికలు జరుగుతాయన్నారు. 80వేల 39 పోస్టులు భర్తీ చేస్తానని, 11 వేల కాంట్రాక్టు ఉద్యోగాలను పర్మినెంట్ చేస్తానని హామీ ఇచ్చారని... కానీ ఈ ఏడాదిలో ఒక్కటి కూడా చెయ్యలేదని ఎంపీ విమర్శించారు.

కేసీఆర్ అసమర్థత, అవినీతి వల్లే పేపర్ లీకేజీ జరిగిందన్నారు. పేపర్ లీక్‌పై ఇప్పటి వరకు కేసీఆర్ ఒక్క మాట కూడా మాట్లాడలేదని మండిపడ్డారు. 503 గ్రూప్ -1 పోస్టులకు మూడున్నర లక్షల మంది అప్లై చేసుకున్నారని తెలిపారు. 17 వేల పోలీస్ ఉద్యోగాలకు 12 లక్షల మంది అప్లై చేసుకున్నారంటే తీవ్రత ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చన్నారు. ప్రభుత్వ యూనివర్సీటీలో కనీస వసతులు, సిబ్బంది లేరని మండిపడ్డారు. అనుచరులకు ప్రైవేట్ యూనివర్సిటీల అనుమతి ఇవ్వడం తప్ప చేసిందినేమీ లేదని అన్నారు. తెలంగాణ యూనివర్సిటీలో ఒక్క పోస్ట్ కూడా భర్తీ చెయ్యలేదన్నారు. కేసీఆర్ నిర్లక్ష్యానికి ఇదే కారణమని అన్నారు. మోదీ కూడా సేమ్ ఇదే ఫాలో అవుతున్నారని విమర్శించారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాల భర్తీ అన్నారని.. 7 ఏళ్ల కాలంలో 18 కోట్ల ఉద్యోగాలని భర్తీ చెయ్యాలని.. కానీ మోదీ చేసిన పనులకు చాలా మంది ఉపాధి కోల్పోయారని ఉత్తమ్ మండిపడ్డారు.

Updated Date - 2023-05-06T14:49:01+05:30 IST