Maheshkumar Goud: మనం కోరుకున్న తెలంగాణ ఇదేనా?
ABN , First Publish Date - 2023-06-02T12:00:24+05:30 IST
గాంధీభవన్‌లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
హైదరాబాద్: గాంధీభవన్‌లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు (Telangana Formation day) ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా వర్కింగ్ ప్రసిడెంట్ మహేష్‌కుమార్ గౌడ్ (Telangana Working President Maheshkumar Goud) జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... తెలంగాణ (Telangana) ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ (Congres Party) అని.. సోనియా గాంధీ (Sonia Gandhi) చొరవ వల్లే తెలంగాణ వచ్చిందన్నారు. అయితే రాష్ట్ర ఆకాంక్షలు నెరవేరలేదని.. కేవల కేసీఆర్ (CM KCR) కుటుంబం తప్ప సామాన్యుడికి ఒరిగిందేమి లేదని విమర్శించారు. దళితులకు 3 ఎకరాల భూమి ఏమైంది? ఉద్యోగాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. మనం కోరుకున్న తెలంగాణ ఇదేనా అంటూ నిలదీశారు. తెలంగాణలో మళ్ళీ గడీల పాలన నడుస్తోందన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను నిర్వీర్యం చేసేందుకు బీజేపీతో (BJP) బీఆర్ఎస్ (BRS) కలిసి పని చేస్తోందని ఆరోపించారు. కవిత (BRS MLC Kavitha) విషయంలో అది నిరూపితమైందన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రజలు పట్టం గడుతారన్నారు. రైతు డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్ ద్వారా ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌ను గద్దె దించాలన్నారు. నిజమైన బంగారు తెలంగాణ కాంగ్రెస్‌తోనే సాధ్యమని మహేష్‌కుమార్ గౌడ్ పేర్కొన్నారు.
ఈ వేడుకల్లో కాంగ్రెస్ నేతలు ఉత్తమ్, వీహెచ్, పొన్నం ప్రభాకర్, అంజన్ కుమార్ యాదవ్, బలరాం నాయక్ తదితరులు పాల్గొన్నారు.