Hyderabad: రేవంత్ రెడ్డిని కలిసిన దివ్యాంగ మహిళ
ABN , First Publish Date - 2023-10-17T15:27:30+05:30 IST
హైదరాబాద్: నాంపల్లికి చెందిన వికలాంగురాలు (మరుగుజ్జు) రజినీ అనే యువతి మంగళవారం గాంధీభవన్‌లో టీపీసీపీ చీఫ్ రేవంత్ రెడ్డిని కలిసింది. తాను పీజీ పూర్తి చేశానని, ఉద్యోగం రాలేదని, ప్రైవేట్ సంస్థల్లో కూడా ఉద్యోగం ఇవ్వడం లేదని తన ఆవేదనను వ్యక్తం చేసింది.
హైదరాబాద్: నాంపల్లికి చెందిన వికలాంగురాలు (Handicapped) (మరుగుజ్జు) రజినీ (Rajini) అనే యువతి మంగళవారం గాంధీభవన్‌లో టీపీసీపీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy)ని కలిసింది. తాను పీజీ (PG) పూర్తి చేశానని, ఉద్యోగం రాలేదని, ప్రైవేట్ సంస్థల్లో కూడా ఉద్యోగం ఇవ్వడం లేదని తన ఆవేదనను వ్యక్తం చేసింది. దీనిపై స్పందించిన రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. డిసెంబర్ 9వ తేదీన ఏల్బీ స్టేడియంలో జరిగే కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా దివ్యాంగురాలిని కోరారు. ప్రభుత్వం ఏర్పాటు కాగానే తన అర్హతలకు తగ్గ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆరు గ్యారెంటీ స్కీముల (Six Guarantee Scheme) కార్డుపై రేవంత్ రెడ్డి స్వయంగా తన దస్తూరీతో దివ్యంగురాలి వివరాలు నమోదు చేసుకున్నారు.
కాగా ప్రవళిక విషయంలో ప్రెస్ మీట్ పెట్టిన డీసీపీపై కేసు పెడతామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అమ్మాయి ఫోన్ సీజ్ చేస్తే సమాచారం ఎలా బయటకు వచ్చిందన్నారు. ఫోన్ ఓపెన్ చేయాలంటే కోర్టు అనుమతి తీసుకోవాలని, ఫోన్ సమాచారం.. ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ రాక ముందే డీసీపీ ప్రెస్ మీట్ ఎలా పెడతారని ప్రశ్నించారు. డీసీపీపై ఎలక్షన్ కమిషన్‌కు పిర్యాదు చేస్తామని రేవంత్ రెడ్డి అన్నారు.
అంతకుముందు గన్‌పార్క్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అమరవీరుల స్థూపం వద్దకు వెళ్లకుండా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. ఎలక్షన్ కోడ్ పేరుతో రేవంత్‌రెడ్డిని అడ్డుకోవడం కలకలం రేపింది. దీంతో పోలీసులతో రేవంత్ వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలోనే పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
రెండు రోజుల క్రితం సీఎం కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. డబ్బు, మద్యం పంచకుండా ఎన్నికలకు వెళ్దామా? అని కేసీఆర్‌కి రేవంత్ సవాల్ విసిరారు. తన సవాలుకు సిద్ధమైతే అమరవీల స్థూపం వద్ద ప్రమాణం చేద్దాం రమ్మని కేసీఆర్‌ని కోరారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేతలతో కలిసి రేవంత్ అమరవీరుల స్తూపం వద్దకు చేరుకున్నారు. అప్పటికే అక్కడ భారీగా మోహరించిన పోలీసులు రేవంత్ సహా కాంగ్రెస్ నేతలను అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వాహనాలను కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. పోలీసుల వ్యాన్ ఎక్కి మరీ రేవంత్ రెడ్డి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం విడిచిపెట్టారు.