Hyderabad: మాదాపూర్ డ్రగ్స్ కేసులో కీలక అంశాలు..
ABN , First Publish Date - 2023-08-31T13:07:06+05:30 IST
హైదరాబాద్: మాదాపూర్ డ్రగ్స్ కేసులో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. సినిమా ఫైనాన్షియర్ వెంకట్, బాలాజీకి డ్రగ్స్ మాఫియాతో లింకులు ఉన్నాయని పోలీసుల విచారణలో బయట పడింది. డ్రగ్స్ మాఫియా కింగ్ పిన్‌లతో వెంకట్, బాలాజీకి సబంధాలున్నాయని...
హైదరాబాద్: మాదాపూర్ డ్రగ్స్ కేసు (Drugs Case)లో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. సినిమా ఫైనాన్షియర్ వెంకట్ (Venkat), బాలాజీ (Balaji)కి డ్రగ్స్ మాఫియా (Mafia)తో లింకులు ఉన్నాయని పోలీసుల విచారణలో బయట పడింది. డ్రగ్స్ మాఫియా కింగ్ పిన్‌లతో వెంకట్, బాలాజీకి సబంధాలున్నాయని, డ్రగ్స్ పార్టీ జరిగిన రూమ్‌లో ఐదు రకాల మత్తు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎల్ఎస్డీ డ్రగ్స్ (LSD Drugs), కొకైన్, గాంజాయి స్వాధీనం చేసుకున్నారు. అయితే స్పాట్లో ఉన్నది కేవలం 5 గురు మాత్రమేనని, అక్కడ ఇన్ని రకలా డ్రగ్స్ ఉండటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డ్రగ్స్ సేవించడానికే కాదు.. డ్రగ్స్ విక్రయం కూడా జరిగినట్టు అనుమానం వ్యక్తమవుతోంది.
కొన్ని నెలలుగా వెంకట్, బాలాజీ డ్రగ్స్ దందాలు చేస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. సినీ ఫైనాన్సర్ వెంకట్ దగ్గర నుంచి భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. 15 గ్రాముల ఎండిఎంఏ.. 30 ఎల్‌ఎస్‌టి పిల్స్‌తో పాటు గంజాయి సీజ్ చేశారు. వెంకట్, బాలాజీలు సర్వీస్ అపార్టుమెంట్లలో డ్రగ్స్ పార్టీలు నిర్వహిస్తుంటారు. వారానికి చొప్పున సర్వీస్ అపార్టుమెంట్లను అద్దెకు తీసుకొని డ్రగ్స్ పార్టీలు నిర్వహిస్తుంటారు. వెంకట్, బాలాజీకి డ్రగ్స్ కస్టమర్లు ఎవరున్నారనేదానిపై నార్కోటిక్ టీమ్ ఆరాతీస్తోంది. వెంకట్ దగ్గర నుంచి డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న సినీ పరిశ్రమ వారిని కూడా పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.