Shamshabad Airport : ఖతార్ ఎయిర్ లైన్స్ విమానం అత్యవసర ల్యాండింగ్

ABN , First Publish Date - 2023-07-27T09:58:01+05:30 IST

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీభత్సంగా వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణం భయానకంగా మారింది. దీంతో రాష్ట్రంలోని కార్యకలాపాలన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఇక శంషాబాద్ విమానాశ్రయం పరిస్థితి దీనికి భిన్నంగా ఏమీ లేదు.

Shamshabad Airport : ఖతార్ ఎయిర్ లైన్స్ విమానం అత్యవసర ల్యాండింగ్

రంగారెడ్డి : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీభత్సంగా వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణం భయానకంగా మారింది. దీంతో రాష్ట్రంలోని కార్యకలాపాలన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఇక శంషాబాద్ విమానాశ్రయం పరిస్థితి దీనికి భిన్నంగా ఏమీ లేదు. నేడు వాతావరణం అనుకూలించక పోవడంతో ఖతార్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానాన్ని పైలెట్ అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ఈ విమానం దోహా నుంచి నాగపూర్ వెళుతోంది. ఎడతెరిపి కురుస్తున్న వర్షానికి వాతావరణం అనుకూలించక పోవడంతో అత్యవసరంగా శంషాబాద్ విమానాశ్రయంలో పైలెట్ ల్యాండ్ చేశారు.

Updated Date - 2023-07-27T14:43:08+05:30 IST