Etela Rajender : బీజేపీ సీనియర్ల మధ్య ముదురుతున్న వివాదం.. జితేందర్ రెడ్డికి ఈటల కౌంటర్

ABN , First Publish Date - 2023-06-30T12:14:10+05:30 IST

బీజేపీ సీనియర్ల మధ్య వివాదం మరింత ముదురుతోంది. బీజేపీ సీనియర్ నేత జితేందర్ రెడ్డికి.. హుజురాబాద్‌ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కౌంటర్ ఇచ్చారు. బీజేపీ సీనియర్ల మధ్య వివాదం ముదురుతోంది. జితేందర్ రెడ్డి ఎందుకు ట్వీట్ చేశారో.. ఆయన ఉద్దేశ్యం ఏంటో ఆయననే అడగాలన్నారు. వయసు, అనుభవం ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలన్నారు.

Etela Rajender : బీజేపీ సీనియర్ల మధ్య ముదురుతున్న వివాదం.. జితేందర్ రెడ్డికి ఈటల కౌంటర్

హైదరాబాద్ : బీజేపీ సీనియర్ల మధ్య వివాదం మరింత ముదురుతోంది. బీజేపీ సీనియర్ నేత జితేందర్ రెడ్డికి.. హుజురాబాద్‌ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కౌంటర్ ఇచ్చారు. బీజేపీ సీనియర్ల మధ్య వివాదం ముదురుతోంది. జితేందర్ రెడ్డి ఎందుకు ట్వీట్ చేశారో.. ఆయన ఉద్దేశ్యం ఏంటో ఆయననే అడగాలన్నారు. వయసు, అనుభవం ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలన్నారు. ఏదీ పడితే అది మాట్లాడకూడదన్నారు. ఎవరి గౌరవానికీ భంగం కలగకుండా చూసుకోవాలన్నారు. ఎవరి స్వేచ్ఛ, గౌరవం తగ్గించకూడదని ఈటల పేర్కొన్నారు.

తెలంగాణ బీజేపీ నాయకత్వానికి ట్రీట్‌మెంట్ అవసరమంటూ ఆ పార్టీ నేత జితేందర్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా పెను దుమారాన్నే రేపారు. ఓ చిన్న వీడియో ద్వారా తెలంగాణ నాయకత్వంపై జితేందర్‌రెడ్డి తన అసంతృప్తినంతా వెళ్లగక్కారు. అసలు ఆ వీడియోలో ఏముందంటే.. ఓ వ్యక్తి దున్నపోతును ట్రాలీలో ఎక్కించడానికి ట్రై చేస్తుంటాడు. అది ఎక్కకుంటే వాటి సీటుపై ఒక్క తన్ను తంతాడు. వెంటనే అది ట్రాలీ ఎక్కుతుంది. సేమ్ టు సేమ్ ట్రీట్‌మెంట్ తెలంగాణ బీజేపీ నాయకత్వానికి కూడా అవసరమని జితేందర్ రెడ్డి ఒక పోస్ట్ పెట్టారు. ఈ ట్వీట్‌ను అమిత్‌ షా, బీఎల్‌ సంతోష్‌, సునీల్‌ బన్సాల్‌ లాంటి అగ్రనేతలకు ట్యాగ్‌ చేశారు.

Updated Date - 2023-06-30T12:14:10+05:30 IST