Hyderabad: బతికున్న మనిషిని చంపేశారు.. పోలీస్స్టేషన్లో ఫిర్యాదుతో..!
ABN , First Publish Date - 2023-07-10T14:50:54+05:30 IST
అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణమైన సంఘటన వెలుగుచూసింది. బతికుండగానే ఓ వ్యక్తిని చంపేశారు. గణేష్ అనే వ్యక్తి చనిపోయినట్లు సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టారు. బాధితుడు అదే సమయంలో ఇంట్లో లేకపోవడంతో భార్య నిజమేనని నమ్మేసింది.
హైదరాబాద్: అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణమైన సంఘటన వెలుగుచూసింది. బతికుండగానే ఓ వ్యక్తిని చంపేశారు. గణేష్ అనే వ్యక్తి చనిపోయినట్లు సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టారు. బాధితుడు అదే సమయంలో ఇంట్లో లేకపోవడంతో భార్య నిజమేనని నమ్మేసింది. భర్త నిజగానే చనిపోయాడు అనుకుని గణేష్ భార్య షాక్కు గురై కుప్పకూలిపోయింది. చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. మరోవైపు బాధితుడు గణేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.