Governor Tamilisai : ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొనే బిల్లుకు ఆమోదం
ABN , First Publish Date - 2023-09-14T12:04:24+05:30 IST
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఉద్యోగులను ప్రభుత్వ సేవల్లోకి తీసుకోవడం) బిల్లు-2023కి ఈరోజు గవర్నర్ తమిళిసై ఆమోదం తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని బిల్లుకు ఆమోదం తెలిపామని గవర్నర్ వెల్లడించారు.
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఉద్యోగులను ప్రభుత్వ సేవల్లోకి తీసుకోవడం) బిల్లు-2023కి ఈరోజు గవర్నర్ తమిళిసై ఆమోదం తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని బిల్లుకు ఆమోదం తెలిపామని గవర్నర్ వెల్లడించారు. ఇంతకాలం కొన్ని టెక్నికల్ కారణాల వల్ల ఆగిందన్నారు. బిల్లు ఆపడం వెనుక ఎలాంటి రాజకీయ కోణం లేదన్నారు. ఇక మీదట ఆర్టీసీ ఎంప్లాయిస్ సంస్థ ఎదగడం కోసం పని చేస్తారని గవర్నర్ ఆశించారు. ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు రాజకీయంగా కొన్ని విమర్శలు రావడం సహజమని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ అశ్వద్ధామ రెడ్డి పేర్కొన్నారు. ఆర్టీసీ బిల్లుకు ఆమోదం తెలిపినందుకు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌కు ఆర్టీసీ కార్మికులు సదా రుణపడి ఉంటారని అశ్వద్ధామరెడ్డి తెలిపారు.