Hyderabad: బైక్‌పై చలాన్లు ఎక్కువగా ఉన్నాయని.. పోలీసులకు దొరక్కుండా వెళ్లేందుకు ఇతడు ఏం ప్లాన్ చేశాడో తెలుసా?
ABN , First Publish Date - 2023-03-15T14:26:56+05:30 IST
ఇటీవల వాహనాలు తనిఖీలు(Vehicle inspections) పెరగడంతో వాహనదారులు చలాన్లు తప్పించుకునేందుకు పలు మార్గాలు
హైదరాబాద్(ఆంధ్రజ్యోతి): ఇటీవల వాహనాలు తనిఖీలు(Vehicle inspections) పెరగడంతో వాహనదారులు చలాన్లు తప్పించుకునేందుకు పలు మార్గాలు అన్వేషిస్తున్నారు. చలాన్లు తప్పించుకునేందుకు పోలీసుల కంటపడకుంటా వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. చివరి పోలీసులకు దొరికిపోతున్నారు. ఇలాగే ఓ వాహనదారుడు బైక్ నెంబర్‌ప్లేట్ కనిపించకుండా మాస్క్ వేసి వెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు.. ఎందుకలా చేశాడని పోలీసులు చెక్ చేయగా ఆ వ్యక్తిపై బైక్‌పై చలాన్లు పెండింగ్ ఉన్నాయని తేలింది.
వివరాల్లోకి వెళితే.. ఎల్‌బీనగర్ ట్రాఫిక్ పీఎస్ పరిధి బండ్లగూడ(Bandlaguda)లో మంగళవారం బండ్లగూడలో ట్రాఫిక్ పోలీసులు (Traffic Police)వాహనాల తనిఖీ స్పెషల్ డ్రైవ్(Special Drive) నిర్వహిస్తున్నారు. ఇంతలో ఎల్‌బీనగర్(L.B.Nagar) చంద్రపురి కాలనీకి చెందిన మారేకర్ వినయ్‌మోహన్ అనే గప్‌చుప్ వ్యాపారి తన బైకు నెం.(టీఎస్ 07 జీఎల్ 6362) ప్లేటుకు మాస్క్ తగిలించుకుని వెళ్తున్నాడు. ట్రాఫిక్ పోలీసులు అతడిని ఆపి బైకును తనిఖీ చేశారు. బైకుపై 19 చలాన్లు(Traffic Challan) పెండింగ్ ఉన్నాయని రూ.5,500 చెల్లించాల్సి ఉందనీ తనిఖీలో తేలింది.బైకును స్వాధీనం చేసుకుని ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించడంతో పాటు చలాన్లు చెల్లించకుండా జాప్యం చేశాడని ట్రాఫిక్ ఎస్‌ఐ జగన్‌మోహన్‌రెడ్డి ఫిర్యాదు చేయడంతో ఎల్‌బీనగర్ లా అండ్ ఆర్డర్ ఎస్‌ఐ రవికుమార్ అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.