Hyderabad: మాదాపూర్‌లోని పల్సెస్ ప్రధాన కార్యాలయంలో ఈడీ సోదాలు
ABN , First Publish Date - 2023-04-01T12:30:31+05:30 IST
మాదాపూర్‌లోని(Madapur) పల్సెస్ ప్రధాన కార్యాలయంలో(Pulses headquarters) ఈడీ(Directorate of Enforcement) సోదాలు నిర్వహిస్తోంది. పల్సెస్ గ్రూపుకు సీఈవోగా
హైదరాబాద్: నగరంలో ఈడీ సోదాలు బడా బాబుల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. శనివారం తెల్లవారుజాము నుండి ప్రముఖ ఫార్మా కంపెనీల డైరెక్టర్ గోపికృష్ణ ఈడీ సోదాలు చేస్తోన్న విషయం తెలిసిందే. కాగా, ఇప్పుడు మాదాపూర్‌లోని(Madapur) పల్సెస్ ప్రధాన కార్యాలయంలో(Pulses headquarters) ఈడీ(Directorate of Enforcement) సోదాలు నిర్వహిస్తోంది. పల్సెస్ గ్రూపుకు సీఈవోగా వ్యవహరిస్తున్న గేదెల శీనుబాబు(Gedela Shinu Babu) ఇంట్లో సోదాలు చేస్తుంది. పల్సెస్ ద్వారా స్కిల్ డెవలప్మెంట్, డిజిటల్ మార్కెటింగ్‌లో(Skill Development Digital Marketing) యువతకు శిక్షణ ఇచ్చి..పల్సెస్ ద్వారా ఫార్మా జర్నల్ను(Pharma Journal) శీను బాబు ప్రచురిస్తున్నారు. దీంతో ఇప్పటి వరకు వెయ్యికి పైగా జర్నల్స్‌ను శ్రీను బాబు ప్రచురించారు. ప్రపంచవ్యాప్తంగా సైన్స్ అండ్ టెక్నాలజీ(Science and Technology Worldwide), ఔషధ రంగాలలో పరిశోధనకు అవసరమైన విషయాలను పల్సెస్ అందుబాటులో ఉంచుతుంది. అమెరికాలోని స్టాండ్ ఫోర్డ్ యూనివర్సిటీ(Stanford University) నుండి పాతికేళ్లకే పోస్ట్ గ్రాడ్యుయేట్‌తో పాటు యువ శాస్త్రవేత్త అవార్డును శీను బాబు దక్కించుకున్నారు. ప్రస్తుతం అమెరికా, సింగపూర్, బ్రిటన్, బెల్జియం(America, Singapore, Britain, Belgium) లతోపాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో(Telangana, Andhra Pradesh) కార్యకలాపాలను గేదెల శ్రీనుబాబు కొనసాగిస్తున్నాడు. విదేశాల నుండి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న కార్యాలయాలకు భారీగా నగదు లావాదేవీలు జరిగినట్లుగా ఈడీ గుర్తించింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్(Prevention of Money Laundering Act) కింద కేసు నమోదు చేసి ఈడీ టీమ్ సోదాలు నిర్వహిస్తోంది.