TS NEWS: హైదరాబాద్‌లో దారుణం - జిమ్‌ సెల్లార్‌లో కత్తులతో...

ABN , First Publish Date - 2023-08-29T20:48:17+05:30 IST

నగరంలో దారుణం జరిగింది. ఓ యువకుడిని అత్యంత దారుణంగా హత్య చేశారు. ఈఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

TS NEWS: హైదరాబాద్‌లో దారుణం -  జిమ్‌ సెల్లార్‌లో కత్తులతో...

హైదరాబాద్‌: నగరంలో దారుణం జరిగింది. ఓ యువకుడిని అత్యంత దారుణంగా హత్య చేశారు. ఈఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళ్తే.. రాజేంద్రనగర్ హైదర్ గూడలోని సెలబ్రిటీ జిమ్ సెల్లార్‌లో గుర్తు తెలియని దుండగులు ఓ యువకుడిని దారుణంగా (Rajendranagar sad incident)చంపేశారు. జిమ్ ముగించుకొని హత్యగావించబడ్డ యువకుడు మోటర్ సైకిల్ కోసం సెల్లార్‌కు వచ్చాడు. యువకుడిపై దుండగులు ఒక్కసారిగా కత్తులతో దాడి చేసి హతమార్చారు. హత్యకు గురైన యువకుడు రాహుల్‌గా గుర్తించారు. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయబ్రాంతులకు గురయ్యారు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. పరిసర ప్రాంతాలను క్లూస్ టీం సహాయంతో రాజేంద్రనగర్ పోలీసులు పరిశీలించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిందితులను కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు.

Updated Date - 2023-08-29T20:48:17+05:30 IST