Inter Exams: విద్యార్థులకు పలు సూచనలు చేస్తూ...
ABN , First Publish Date - 2023-03-14T15:54:19+05:30 IST
బుధవారం నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్షలకు (Inter Exams) అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఇంటర్ బోర్డు సెక్రటరీ
హైదరాబాద్: బుధవారం నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్షలకు (Inter Exams) అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఇంటర్ బోర్డు సెక్రటరీ నవీన్ మిట్టల్ (Naveen Mittal) స్పష్టం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయని తెలిపారు. విద్యార్థులు 8.30 గంటలకే ఎగ్జామ్ సెంటర్‌కు చేరుకోవాలని సూచించారు. 1473 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా.. 26,333 ఇన్విజిలెటర్స్‌ని నియమించారు. మొత్తం 200 సిట్టింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది 9,47,699 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని వెల్లడించారు. పరీక్ష కేంద్రాలకు అదనపు బస్సులు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులను కోరినట్లు చెప్పారు. ఎగ్జామ్ ప్యాడ్ చూపిస్తే ఆర్టీసి బస్సు ఆపాలని సూచనలు ఇచ్చామని.. అంతేకాకుండా పరీక్షా కేంద్రాల వైపు ఎక్కువ బస్సులు తిరిగేలా ఏర్పాట్లు చేశామన్నారు. అలాగే పరీక్ష కేంద్రాలకు విద్యుత్ సరఫరా అంతరాయం లేకుండా చూడాలని విద్యుత్ శాఖ అధికారులకు విన్నవించామన్నారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో ప్రశ్నపత్రాలు సీల్ తీయడం.. జవాబు పత్రాలు ప్యాక్ చేయడం జరుగుతుందన్నారు. హాల్ టికెట్లు నేరుగా విద్యార్థులే డౌన్ లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించినట్లు చెప్పుకొచ్చారు. హాల్ టికెట్‌పై పేరు, సబ్జెక్ట్స్ పరిశీలించుకోవాలని స్పష్టం చేశారు. ఇక ఇన్విజిలేటర్లు కూడా పరీక్ష హాల్‌లోకి సెల్‌ఫోన్స్ అనుమతి లేదన్నారు. ఇంటర్ అడ్మిషన్లు ఆన్‌లైన్‌లో జరిపే ఆలోచనలో ఉన్నామన్నారు. పరీక్షా కేంద్రాల దగ్గర ప్రత్యేక జాగ్రత్తలతో పాటు విద్యార్థులకు అవసరమైన సదుపాయాలు, తాగునీరు, ఓఆర్‌ఎస్ అందుబాటులో ఉంచాలని అధికారులకు ఆదేశించారు. పరీక్షల నిర్వహణ సమయంలో తలెత్తే సమస్యలకు సత్వర పరిష్కారం లభించే విధంగా ప్రత్యేకంగా కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. ఇక పరీక్షా కేంద్రాల దగ్గర సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తూ ఎప్పటికప్పుడు వాటిని మానిటరింగ్ చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: NVSS.Prabhakar: కేటీఆర్‌కు ఆ 42 కోట్లు ఎక్కడ్నుంచి వచ్చాయి?