Kodanda Reddy : తెలంగాణలో ధరణి పేరుతో కుంభ కోణాలు

ABN , First Publish Date - 2023-07-08T21:11:47+05:30 IST

తెలంగాణ(Telangana)లో ధరణి (Dharani)పేరుతో కుంభ కోణాలు జరుగుతున్నాయని జాతీయ కిసాన్ కాంగ్రెస్(Congress) ఉపాధ్యక్షులు కోదండ‌రెడ్డి(Kodanda Reddy) అన్నారు.

Kodanda Reddy : తెలంగాణలో ధరణి పేరుతో కుంభ కోణాలు

హైదరాబాద్: తెలంగాణ(Telangana)లో ధరణి (Dharani)పేరుతో కుంభ కోణాలు జరుగుతున్నాయని జాతీయ కిసాన్ కాంగ్రెస్(Congress) ఉపాధ్యక్షులు కోదండ‌రెడ్డి(Kodanda Reddy) అన్నారు. శనివారం గాంధీ భవన్ నుంచి జాతీయ కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కోదండ‌రెడ్డి .సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కోదండ‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఏ సంస్కరణలు తీసుకువచ్చిన బాధ్యతగా చట్ట పరంగా భద్రత కల్పించే విధంగా ఉంటుందన్నారు. ధరణి రికార్డుల ప్రక్షాళనపైన గ్రామ గ్రామాన తిరిగి హక్కుదారుల నుంచి చాలా విషయాలు సేకరించినట్లు తెలిపారు. రేవంత్‌రెడ్డి ధరణి పేరుతో పెద్ద మాఫియా జరుగుతుందనీ లోతుగా విశ్లేషించిన తర్వతే మాట్లాడారని చెప్పారు. సీఎం కేసిఆర్ అవినీతి ఆరోపణలు ఎదుర్కుంటున్న సీఎస్‌ను పక్కన పెట్టుకొని వేల కోట్ల రూపాయలు కాజేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో పేద రైతులకు ఇచ్చిన భూములు గుంజుకుంటున్నారన్నారు. సీనియర్ రెవెన్యూ అధికారుల సలహాలు తీసుకొని భూ డిక్లరేషన్ తీసుకొచ్చినట్లు వెల్లడించారు.

ఇప్పటి వరకు 75 లక్షల రైతులకు మాత్రమే పట్టపాసు బుక్కులు ఇచ్చారని, ఈ 75 లక్షల రైతుల భూములు రాత్రికి రాత్రే మాయం అవ్వొచ్చని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వేస్తే ధరణి పోర్టల్ ఎత్తివేస్తారని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్నారు. ధరణి ఎత్తి వేస్తే రైతుబంధు రాదని.. కేసీఆర్ తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. టీఆర్ఎస్ నేతలు సమాధానం చెప్పలేక రేవంత్‌పైన అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ధరణి పోర్టల్‌లో జరిగిన అవకవతవకల వల్ల రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. భూములు సర్వే జరగకుండా పట్ట ఇచ్చే హక్కు లేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చకా టైటిల్ గ్యారంటీ తీసుకువచ్చి రైతుల హక్కులను కాపాడతామని హామీ ఇచ్చారు.


కాంగ్రెస్‌కి టెక్నాలజీ కొత్తేం కాదు: మల్లు రవి

దొంగే దొంగా దొంగా అన్నట్టుగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నేత మల్లు రవి అన్నారు. కాంగ్రెస్ పార్టీకి టెక్నాలజీ కొత్తేం కాదన్నారు. టెక్నాలజీ ప్రైవేటు వ్యక్తుల దగ్గర పెట్టి కేసీఆర్ చేతుల్లో పెట్టుకున్నారన్నారు. కాంగ్రెస్ పేదలకు ఇచ్చిన అసైన్డ్ లాండ్స్ అన్ని ధరణి పోర్టల్‌లో నిషేదం అని లిస్ట్‌లో పెట్టి అక్రమాలు చేస్తున్నారన్నారు. అసైన్డ్ భూములను తక్కువ ధరకు కార్పొరేట్ సంస్థలకు అప్పనంగా ఇస్తున్నారని మండిపడ్డారు.పరిశ్రమలకు ప్రాజెక్టులకు అసైన్డ్ భూములు వాడినట్లుగానే.... దళితులు, గిరిజనులకు ఇస్తానన్న భూములు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం గుంజుకున్న పేదల అసైన్డ్ భూములన్నీ తిరిగి వాళ్లకు ఇచ్చేందుకు కాంగ్రెస్ కృషి చేస్తుందని మల్లు రవి తెలిపారు.

Updated Date - 2023-07-08T21:12:02+05:30 IST