TS News: నాంపల్లి కోర్టుకు మాదాపూర్ డ్రగ్స్ కేసు నిందితులు
ABN , First Publish Date - 2023-09-01T15:55:15+05:30 IST
రాష్ట్రంలో సంచలనం రేపిన మాదాపూర్ డ్రగ్స్ కేసులో నిందితులను పోలీసులు నాంపల్లి కోర్టు హాజరుపర్చారు.
హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం రేపిన మాదాపూర్ డ్రగ్స్ కేసులో నిందితులను పోలీసులు నాంపల్లి కోర్టు హాజరుపర్చారు. నిందితులు బాలాజీ, వెంకటరత్నం రెడ్డి, మురళిలను పోలీసులు న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. వీరికి నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో చంచల్ గూడ జైల్‌కు తరలించారు. కాగా.. ఈ కేసులో మరింత దర్యాప్తు కోసం పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేయనున్నారు. బాలాజీ, వెంకట్ లిస్టులో ఉన్న 18 మంది జాబితాపై పోలీసుల విచారణ చేయనున్నారు. బెంగళూరు నైజీరియన్లతో సంబంధాలు, డ్రగ్స్ సప్లై ఆరా తీయనున్నారు. సినీ నిర్మాత కేపీ చౌదరితో బాలాజీ, వెంకట్ పరిచయాలపై పోలీసులు విచారించనున్నారు. టాలీవుడ్‌లో ప్రముఖులకు డ్రగ్స్ అందించినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. టాలీవుడ్ డ్రగ్స్ లింకులపై కూడా నార్కోటిక్ బ్యూరో అధికారులు కస్టడీలో విచారణ చేయనున్నారు.