Madhuyashki: ఆ తీర్పు చారిత్రాత్మకం

ABN , First Publish Date - 2023-09-27T17:20:45+05:30 IST

తెలంగాణ హైకోర్టు(Telangana High Court) గ్రూప్‌1 పరీక్షలను రద్దు చేస్తూ ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమని కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ (Madhuyashki) అన్నారు.

Madhuyashki: ఆ తీర్పు చారిత్రాత్మకం

హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు(Telangana High Court) గ్రూప్‌1 పరీక్షలను రద్దు చేస్తూ ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమని కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ(Madhuyashki) అన్నారు. బుధవారం నాడు గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్(KTR) యువత జీవితాలతో అడుకుంటున్నారు. టీఎస్పీఎస్సీ(TSPSC) సరైన రూల్స్ పాటించకపోవడంతో 12 సార్లు ప్రశ్నాపత్రాలు లీకయ్యాయి. యువతలకి ఉద్యోగాల పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేస్తోంది. తిరిగి పరీక్షలు పెట్టినప్పుడు .. ఏజ్ రెలాక్సేషన్ ఉండాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. తిరిగి మళ్లీ పరీక్షలు రాయలంటే ప్రభుత్వమే ఆర్థిక సాయం అందించాలి. రద్దయిన పరీక్షలకు బాధ్యత వహిస్తూ.. కేసీఆర్, కేటీఆర్(KTR) రాజీనామా చేయాలి.’’ అని మధుయాష్కీ పేర్కొన్నారు.

సీబీఐతో దర్యాప్తు చేయించాలి

నిరుద్యోగుల పక్షాన ఎన్.ఎస్.యూ.ఐ మొదటి నుంచి పోరాటం చేస్తోందని ఎన్.ఎస్.యూ.ఐ అధ్యక్షుడు బల్మూరు వెంకట్(Balmuru Venkat) వ్యాఖ్యానించారు. గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అర్హత గల నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే వరకు అండగా ఉంటాం. టీఎస్పీఎస్సీలో అక్రమాలు జరిగాయని తేలినా కూడా వారిపై చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం ఎందుకు వెనకడుగు వేస్తుంది. టీఎస్పీఎస్సీపై సీబీఐ దర్యాప్తుకు ప్రభుత్వం ఎందుకు నిరాకరిస్తోందని బల్మూరు వెంకట్ ప్రశ్నించారు.

Updated Date - 2023-09-27T17:20:45+05:30 IST