Share News

TS NEWS: తెలంగాణలో 11 మంది ఐఏఎస్‌ల బదిలీ

ABN , Publish Date - Dec 17 , 2023 | 04:17 PM

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్‌రెడ్డి రాష్ట్ర పగ్గాలు చేపట్టారు. ప్రభుత్వం మారగానే గతంలో కీలక పోస్టుల్లో ఉన్న అధికారులను మార్చడం సర్వసాధారణంగా వస్తోంది. దీంతో రేవంత్ ప్రభుత్వం పలు శాఖల్లో మార్పులు చేపట్టింది. తాజాగా 11మంది ఐఏఎస్‌ అధికారులను వివిధ శాఖలకు బదిలీ చేశారు. ఈ మేర‌కు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతి కుమారి ఉత్త‌ర్వులు జారీ చేశారు.

TS NEWS: తెలంగాణలో 11 మంది ఐఏఎస్‌ల బదిలీ

హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్‌రెడ్డి రాష్ట్ర పగ్గాలు చేపట్టారు. ప్రభుత్వం మారగానే గతంలో కీలక పోస్టుల్లో ఉన్న అధికారులను మార్చడం సర్వసాధారణంగా వస్తోంది. దీంతో రేవంత్ ప్రభుత్వం పలు శాఖల్లో మార్పులు చేపట్టింది. తాజాగా 11మంది ఐఏఎస్‌ అధికారులను వివిధ శాఖలకు బదిలీ చేశారు. ఈ మేర‌కు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతి కుమారి ఉత్త‌ర్వులు జారీ చేశారు.

బదిలీ అయిన ఐఏఎస్‌లు వీరే..

  • పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న అర్వింద్‌ కుమార్‌‌ని విపత్తు నిర్వహణశాఖకు బదిలీ చేశారు.

  • విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా బుర్రా వెంకటేశంను నియమించారు. కళాశాల, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు.

  • పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శిగా దానకిశోర్‌ నియమితులయ్యారు. ఆయనకు హెచ్‌ఎండీఏ, సీడీఎంఏ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు.

  • జలమండలి ఎండీగా సుదర్శన్‌రెడ్డి.

  • వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శిగా క్రిస్టినా.

  • ఆర్‌అండ్‌బీ శాఖ ముఖ్య కార్యదర్శిగా కె.ఎస్. శ్రీనివాసరాజును నియమించారు.

  • జీఏడీ కార్యదర్శిగా రాహుల్‌ బొజ్జాను నియమించారు. ఎస్సీ అభివృద్ధిశాఖ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు.

  • అటవీ, పర్యావరణశాఖ ముఖ్యకార్యదర్శిగా వాణి ప్రసాద్‌ను నియమించారు. ఈపీటీఆర్‌ఐ డైరెక్టర్‌ జనరల్‌గా వాణిప్రసాద్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు.

  • మహిళా శిశుసంక్షేమ శాఖ కార్యదర్శిగా వాకాటి కరుణ నియమితులయ్యారు.

  • వాణిజ్య పన్నులశాఖ కమిషనర్‌గా టి.కె.శ్రీదేవి.

  • నల్గొండ కలెక్టర్‌‌గా ఉన్న ఆర్వీ కర్ణన్‌‌ని .. వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్‌గా నియమించారు.

Updated Date - Dec 17 , 2023 | 05:03 PM