TS News: 13ఏళ్ల పెళ్లి ప్రయాణం.. తరచూ వేధింపులు.. చివరకు ఆ వివాహిత..

ABN , First Publish Date - 2023-03-11T11:21:15+05:30 IST

కట్టుకున్న భర్తే తరుచూ వేధింపులకు గురిచేయడంతో ఆ వివాహిత తట్టుకోలేకపోయింది.

TS News: 13ఏళ్ల పెళ్లి ప్రయాణం.. తరచూ వేధింపులు.. చివరకు ఆ వివాహిత..

హైదరాబాద్: కట్టుకున్న భర్తే తరుచూ వేధింపులకు గురిచేయడంతో ఆ వివాహిత తట్టుకోలేకపోయింది. పదమూడు సంవత్సరాలుగా మారుతాడని భావించిన వివాహితకు నిరాశే ఎదురైంది. రోజు రోజుకు అతడి వేధింపులు ఎక్కువ కావడంతో విసిగిపోయిన మహిళ కన్న బిడ్డలను ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఈ ఘటన భాగ్యనగరంలోని జూబ్లీహిల్స్‌లో చోటు చేసుకుంది.

జూబ్లీహిల్స్‌లో ఓ వివాహిత అదృశ్యం కలకలం రేపుతోంది. జూబ్లీహిల్స్‌లోని గాయత్రిహిల్స్‌కు చెందిన అశ్విని, రామకృష్ణ దంపతులకు 13 సంవత్సరాలక్రితం వివాహం జరిగింది. వీరికి ముగ్గురు సంతానం. అశ్వినినీ రామకృష్ణ తరచూ వేధింపులకు గురిచేసేవాడు. దీంతో వేధింపులు తాళలేక అశ్విని ఇంటి నుంచి వెళ్లిపోయింది. అయితే రామకృష్ణ అంతా వెతికినప్పటికీ అశ్విని జాడ తెలియలేదు. చివరకు బందువుల ఇంటికి కూడా వెళ్లలేదని తెలియడంతో రామకృష్ణ పోలీసులను ఆశ్రయించారు. తన భార్య కనిపించడం లేదంటూ రామకృష్ణ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అశ్విని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Updated Date - 2023-03-11T11:21:15+05:30 IST