Share News

KTR:కాంగ్రెస్‌కు 40 సీట్లూ కష్టమే.. వచ్చేది బీఆర్ఎస్ సర్కారే: కేటీఆర్

ABN , First Publish Date - 2023-11-05T18:52:58+05:30 IST

తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ చేసిందేమీలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీరామారావు(KTR) విమర్శించారు. ఆదివారం ఆమనగల్ లో బీఆర్ఎస్ ప్రజాశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ.. రైతు బంధు, రైతు బీమా ఇచ్చే నాయకుడు సీఎం కేసీఆర్ అని ఉద్ఘాటించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ ఎన్నికల్లో(Telangana Elections) కాంగ్రెస్ కి 40 సీట్లు రావడమూ కష్టమేనని జోస్యం చెప్పారు.

KTR:కాంగ్రెస్‌కు 40 సీట్లూ కష్టమే.. వచ్చేది బీఆర్ఎస్ సర్కారే: కేటీఆర్

కల్వకుర్తి : తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ చేసిందేమీలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీరామారావు(KTR) విమర్శించారు. ఆదివారం కల్వకుర్తి నియోజకవర్గం ఆమన్ గల్ లో బీఆర్ఎస్ ప్రజాశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ.. రైతు బంధు, రైతు బీమా ఇచ్చే నాయకుడు సీఎం కేసీఆర్ అని ఉద్ఘాటించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ ఎన్నికల్లో(Telangana Elections) కాంగ్రెస్ కి 40 సీట్లు రావడమూ కష్టమేనని జోస్యం చెప్పారు. కాంగ్రెస్(Congress) అధికారంలోకి రాబోదని అన్నారు. కేసీఆర్ సింహం లాంటోడని.. సింహం సింగిల్‌గానే వస్తుందని వ్యాఖ్యానించారు. విపక్షాలు ఇచ్చే డబ్బులు తీసుకుని ఓటు మాత్రం కారు గుర్తుకే వేయాలని ఓటర్లను కోరారు. తెలంగాణలో దేశంలోనే ఎక్కడా లేనన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజా సంక్షేమం జరగాలన్నా.. అభివృద్ధి కొనసాగాలన్న కారును గెలిపించాలని విన్నవించారు. ఈ సందర్భంగా పలువురు విపక్ష నేతలు బీఆర్ఎస్ లో చేరారు.

Updated Date - 2023-11-05T19:01:03+05:30 IST