TS NEWS: మంత్రి సబితారెడ్డి గన్‌మెన్ ఆత్మహత్య
ABN , First Publish Date - 2023-11-05T08:27:59+05:30 IST
తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ( Minister Sabita Reddy ) కి ఊహించని షాక్ తగిలింది. మంత్రి సబితారెడ్డి గన్‌మెన్ ఏఆర్ ఎస్ఐ ఫజల్ ( Gunmen Fazal ) తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
హైదరాబాద్: తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ( Minister Sabita Reddy ) కి ఊహించని షాక్ తగిలింది. మంత్రి సబితారెడ్డి గన్‌మెన్ ఏఆర్ ఎస్ఐ ఫజల్ ( Gunmen Fazal ) తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంత్రి గన్‌మెన్ నుదుటిపై పాయింట్ బ్లాక్ రేంజ్‌లో గన్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది. ఈ విషయం తెలియగానే సంఘటన స్థలానికి మంత్రి సబితారెడ్డి చేరుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను మంత్రి సబితా, వెస్ట్ జోన్ డీసీపీ జోయెల్ డేవిస్ తెలుసుకుంటున్నారు. లోన్ రికవరీ వేధింపులతో ఫజల్ ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. కూతురు ముందే ఏఎస్ఐ ఫజల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శ్రీనగర్ కాలనీలోని మణికంఠ హోటల్ దగ్గర తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సంఘటన జరిగిన స్థలాన్ని జూబ్లీహిల్స్ పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ సంఘటనతో మంత్రి సబితారెడ్డి తీవ్ర బావోద్వేగానికి గురయ్యారు. గన్‌మెన్ ఫజల్ ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. శ్రీనగర్ కాలనీలో గన్‌మెన్ ఫజల్ నివాసం ఉంటున్నాడు. కుటుంబ అవసరాల నిమిత్తం ఫజల్ లోన్ యాప్‌లో కొంత నగదు తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే నగదు కోసం లోన్ యాప్ నిర్వాహకులు తరచూగా ఫోన్ చేస్తూ వేధిస్తున్నారు. దీంతో తీవ్ర మనస్థాపనికి గురయిన ఫజల్ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఫజల్ ఆత్మహత్యపై విచారణ చేపట్టాం: డీసీపీ జోయెల్ డేవిస్
ఎఆర్ ఎస్ఐ ఫజల్ ఈరోజు ఉదయం 6 గంటలకు తన వెపన్‌తో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై వెస్ట్ జోన్ డీసీపీ జోయెల్ డేవిస్ మీడియాకు వివరాలు తెలిపారు. ఈ సందర్భంగా డీసీపీ మీడియాతో మాట్లాడుతూ.. ఎఆర్ ఎస్ఐ ఫజల్ ఆత్మహత్యపై విచారణ చేపట్టాం. ఈ విచారణలో ప్రాథమిక దర్యాప్తులో ఆర్ధిక సమస్యల వల్ల ఫజల్ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఎస్కార్ట్‌లో డ్యూటీ ఉన్న క్రమంలో ఉదయం 6 గంటలకు రిలేవర్ కు తన బాధ్యతలను రిలీవింగ్ ఇచ్చాడు. ఈ రోజు తన కూతురిని కూడా తీసుకొని వచ్చాడు. మణికంఠ హోటల్ వద్ద ఆమెతో మాట్లాడి గన్‌తో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డడు. కుటుంబసభ్యులు తన ఆత్మహత్యపై కేసు పెట్టారు..తదుపరి వివరాలు దర్యాప్తులో తెలుతాయని డీసీపీ జోయెల్ డేవిస్ తెలిపారు.
లోన్‌యాప్ వేధింపులతోనే మా నాన్న ఆత్మహత్య: ఫజల్ కూతురు
ఏఆర్ ఎస్ఐ ఫజల్ ఆత్మహత్యపై తన కూతురు మీడియాతో మాట్లాడారు. ‘‘మా నాన్న ఓ బ్యాంకులో మూడు లక్షల రూపాయల లోన్ తీసుకున్నాడు. అప్పు మొత్తం తిరిగి చెల్లించాడు... అయినప్పటికీ లోన్ కట్టాలని బ్యాంకర్స్ వేధింపులకు గురి చేశారు. మరో 10 లక్షలు రూపాయలు అప్పు ఉందని బ్యాంకర్స్ ఇబ్బంది పెట్టారు. బ్యాంకర్స్ వేధింపులు భరించలేక నాన్న సూసైడ్ చేసుకున్నారు. ఈరోజు ఉదయం విధుల్లోకి హాజరవడానికి తనతో పాటు నన్ను కూడా మా నాన్న పనిచేసే ప్రాంతానికి తీసుకువచ్చాడు. నాతో మాట్లాడుతూ లోన్ కట్టిన పేపర్లు నాకు చూపించాడు. అనంతరం నన్ను పక్కకు చూడమని చెప్పి సర్వీస్ రివాల్వర్‌తో పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో షూట్ చేసుకున్నాడు. బ్యాంకర్స్ వేధింపులే మా నాన్న ఆత్మహత్యకు కారణం’’ అని ఏఆర్ ఎస్ఐ ఫజల్ కూతురు తెలిపారు.
మరికాసేపట్లో ఫజల్ అలీ మృతదేహానికి పోస్టుమార్టం
మంత్రి సబితా ఎస్కార్డ్ ఆఫీసర్ AR ఎస్సై ఫజల్ అలీ మృతిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. తన సర్వీస్ రివాల్వర్‌తో పాయింట్ బ్లాక్‌లో కాల్చుకొని ఏఆర్ ఎస్సై ఫజల్ అలీ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఫజల్ అలీ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆర్థిక ఇబ్బందులే ఆత్మహత్యకు కారణంగా పోలీసులు తేల్చారు. ఇటీవల కాలంలో పలు బ్యాంకుల నుంచి ఫజల్ అలీ లోన్ తీసుకున్నారు. లోన్ రికవరీ వేధింపులు తాళలేక తన గన్‌తో ఫైర్ చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఫజల్ అలీ మృతదేహాన్ని ఉస్మానియా మార్చరికి తరలించారు. ఫజల్ అలీ మృతదేహానికి వైద్యులు మరి కాసేపట్లో పోస్టుమార్టం నిర్వహించనున్నారు.