Minister Sabita: కేసీఆర్ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలనే కుట్ర..

ABN , First Publish Date - 2023-04-05T16:24:14+05:30 IST

రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని (KCR Govt.) అప్రతిష్టపాలు చేయాలనే ఆలోచనతోనే పేపర్ లికేజీలు (Paper Leakages) చేస్తున్నారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Minister Sabitha Indra Reddy) అన్నారు.

Minister Sabita: కేసీఆర్ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలనే కుట్ర..

వికారాబాద్ జిల్లా: రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని (KCR Govt.) అప్రతిష్టపాలు చేయాలనే ఆలోచనతోనే పేపర్ లికేజీలు (Paper Leakages) చేస్తున్నారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Minister Sabitha Indra Reddy) అన్నారు. వరుస పేపర్ లికేజ్‌ నేపథ్యంలో బుధవారం వికారాబాద్‌లో మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ (BJP) పెద్దల పర్యవేక్షణలోనే రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ స్వార్ధ రాజకీయాల కోసం ఐదు లక్షల మంది విద్యార్ధుల జీవితాలతో చెలగాటం అడుగుతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ (TSPSC Paper Leakage)లో రాజశేఖర్, పదవ తరగతి పేపర్ లికేజీ (10th Class Paper Leakage)లో పాత్ర ఉన్న ప్రశాంత్‌లకు బీజేపీ నాయకులతో సంబంధాలు ఉన్నాయని మంత్రి సబితా అన్నారు. తాండూరులో పదో తరగతి పేపర్ లిక్ చేసిన టీచర్ కూడా బీజేపీ అనుబంధ సంఘం సభ్యులని.. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలనుకునేవారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, పేపర్ లీక్ చేసినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. వాట్సాప్‌లో పేపర్ సర్క్యూలేట్ చేసి గందరగోళం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. పిల్లల భవిష్యత్తుపై బాధ్యత ఉన్న ఏ పార్టీ ఇలా చేయదని మంత్రి సబితా ఇంద్రారెడ్డి వ్యాఖ్యానించారు.

Updated Date - 2023-04-05T16:24:14+05:30 IST