Srinivas Goud : 22 లిక్కర్ షాపులకు లక్కీడిప్ నిలిపివేశాం
ABN , First Publish Date - 2023-08-21T12:03:23+05:30 IST
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2,598 లిక్కర్ షాపులకు లక్కీడిప్ ద్వారా ఎంపిక జరుగుతుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రకటించారు. అయితే 22 షాపులకు తక్కువ దరఖాస్తులు వచ్చినందుకు వాటికి లక్కీడిప్ నిలిపివేశామన్నారు. మొత్తం లక్షా 31,970 దరఖాస్తులు వచ్చాయి. పారదర్శకంగా లక్కీడిప్ నిర్వహిస్తున్నామన్నారు.
మహబూబ్ నగర్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2,598 లిక్కర్ షాపులకు లక్కీడిప్ ద్వారా ఎంపిక జరుగుతుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రకటించారు. అయితే 22 షాపులకు తక్కువ దరఖాస్తులు వచ్చినందుకు వాటికి లక్కీడిప్ నిలిపివేశామన్నారు. మొత్తం లక్షా 31,970 దరఖాస్తులు వచ్చాయి. పారదర్శకంగా లక్కీడిప్ నిర్వహిస్తున్నామన్నారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఏ చిన్న పొరపాటు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి శీనివాస్ గౌడ్ తెలిపారు. ఎవరైనా తప్పులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గతంలో ఇతర రాష్ట్రాల నుంచి మాఫియా వచ్చి విచ్చల విడిగా కల్తీ మద్యం విక్రయాలు చేసేవారన్నారు. మాఫియా ఎక్సైజ్ సుంకం కూడా రాకుండా చేసిన పరిస్థితి ఉమ్మడి రాష్ట్రంలో జరిగేదన్నారు. తెలంగాణ వచ్చాక రాష్ట్రంలో నకిలీ, కల్తీ మద్యం విక్రయాలను అరికట్టామని శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు.