Minister Srinivas Gowd: తెలంగాణలో పర్యాటకుల సంఖ్య బాగా పెరిగింది
ABN , First Publish Date - 2023-10-05T19:19:48+05:30 IST
తెలంగాణలో పర్యాటకుల సంఖ్య బాగా పెరిగిందని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ (Minister Srinivas Gowd)వ్యాఖ్యానించారు.
మహబూబ్‌నగర్: తెలంగాణలో పర్యాటకుల సంఖ్య బాగా పెరిగిందని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ (Minister Srinivas Gowd)వ్యాఖ్యానించారు. పలు జిల్లాల్లోని 15 ప్రాంతాల్లో పర్యాటక.. క్రీడా.. వారసత్వ శాఖల ద్వారా 125 కోట్ల రూపాయల ఖర్చుతో అభివృద్ధి కార్యక్రమాలను వర్చువల్‌గా మంత్రి శ్రీనివాస్ గౌడ్, గెల్లు శ్రీనివాస్, అధికారులు. ప్రారంభించారు. ఈసందర్భంగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మీడియాతో మాట్లాడుతూ...‘‘ పర్యటక రంగంలో గత పదేళ్లలో 2,500 కోట్ల రూపాయలతో రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాం. దాంతో మన రాష్ట్రానికి వెయ్యి శాతం అధికంగా పర్యాటకులు వచ్చారు. ఏకో.. మెడికల్.. టెంపుల్ టూరిజం తెలంగాణలో బాగా పెరిగింది. మహబూబ్‌నగర్‌లో కేసీఆర్(KCR) ఏకో పార్క్.. మన్యంకొండ రోప్‌వే.. జంగల్ సఫారీ లాంటి ఎన్నో ప్రత్యేకతలతో పర్యటక రంగంలో వసతులు సమకుర్చాం. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రామప్ప దేవాలయానికి UNESCO గుర్తింపు రావటం చాలా సంతోషం. భద్రాద్రి.. ఖమ్మం.. కుతుబ్ షాహీ టూంబ్స్ లాంటి ప్రాంతాలను అభివృద్ధి చేశాం. రాష్ట్రంలో ఏడు సస్పెన్షన్ బ్రిడ్జిలు ఏర్పాటు చేశాం. రాష్ట్రంలో ఉన్న క్రీడా ప్రాంగణాల మొత్తం స్థలం.. దేశంలోనే అత్యంత పెద్ద విస్తీర్ణంలో మన దగ్గర ఉన్నాయి. వీటి వల్ల భవిష్యత్తులో ఎక్కువమంది క్రీడాకారులు ఉన్న రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఉంటుంది’’ అని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు.