MLA Jaggareddy: జర్నలిస్టులకు ఇచ్చిన ఇంటి స్థలాల హామీని నిలబెట్టుకోవాలి..
ABN , First Publish Date - 2023-02-04T14:14:40+05:30 IST
హైదరాబాద్: రైతు రుణమాఫీ ప్రక్రియను పూర్తి చేయాలని, పేదవాళ్ళకు 100 గజాల ఇళ్ల స్థలం ఇచ్చే జీవో మళ్ళీ తీసుకురావాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.
హైదరాబాద్: రైతు రుణమాఫీ (Farmer Loan Waiver) ప్రక్రియను పూర్తి చేయాలని, పేదవాళ్ళకు 100 గజాల ఇళ్ల స్థలం ఇచ్చే జీవో (GO) మళ్ళీ తీసుకురావాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి (MLA Jaggareddy) ప్రభుత్వాన్ని కోరారు. శనివారం అసెంబ్లీ (Assembly)లో గవర్నర్ (Governor) ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చలో భాగంగా ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు నిధులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారని అన్నారు. అలాగే కళ్యాణ లక్ష్మి (Kalyana Lakshmi) షాదీ ముభరక్ (Shadi Mubarak) సహాయం రూ. రెండు లక్షలు పెంచాలన్నారు. ఈ స్కీంకు మరో రెండు లక్షలు అదనంగా ఇవ్వాలని కోరారు.
జర్నలిస్టులకు (Journalists) ఇచ్చిన ఇంటి స్థలాల హామీని నిలబెట్టుకోవాలని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రభుత్వానికి సూచించారు. క్యాన్సర్ రోగుల సమస్యలపై ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. వైద్యం కోసం ఆ కుటుంబాలు అప్పుల పాలు అవుతున్నాయన్నారు. యాదాద్రి (Yadadri)కి మెట్రో రైల్ ఏర్పాటు చేయాలని, అలాగే సంగారెడ్డి (Sangareddy)కి కూడా మెట్రోను విస్తరించాలని కోరారు. రాష్ట్రంలో నిరుద్యోగ భృతి రూ. 3016 ఇస్తామన్నారు... ఆ అంశం గవర్నర్ ప్రసంగంలో రాలేదని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు.