Raja Singh: డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లపై మంత్రి కేటీఆర్‌కు రాజాసింగ్ కౌంటర్

ABN , First Publish Date - 2023-09-21T15:34:27+05:30 IST

హైదరాబాద్: డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లపై మంత్రి కేటీఆర్‌కు ఎమ్మెల్యే రాజాసింగ్ కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా గురువారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల రెండో విడుత పంపిణీ కార్యక్రమం ఇవాళ జరిగిందని.. ఈ కార్యక్రమంలో కేటీఆర్ ఏదేదో మాట్లాడారని అన్నారు.

Raja Singh: డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లపై మంత్రి కేటీఆర్‌కు రాజాసింగ్ కౌంటర్

హైదరాబాద్: డబుల్ బెడ్‌రూమ్ (Double Bedroom) ఇళ్లపై మంత్రి కేటీఆర్‌ (Minister KTR)కు ఎమ్మెల్యే రాజాసింగ్ (MLA Rajasingh) కౌంటర్ (Counter) ఇచ్చారు. ఈ సందర్భంగా గురువారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు రెండో విడుత పంపిణీ కార్యక్రమం ఇవాళ జరిగిందని.. ఈ కార్యక్రమంలో కేటీఆర్ ఏదేదో మాట్లాడారని అన్నారు. ‘‘మీరు తెలంగాణలో ఎంతమందికి ఇళ్లు ఇస్తున్నారు.. మీకు అసలు ఆ డేటా తెలుసా... ఒకసారి తెలుసుకోండి.. 2.16 లక్షల ఇండ్లు కట్టినట్లు గూగుల్ ద్వారా తెలిసిందని.. కానీ లక్ష ఇళ్ళు కూడా కట్టలేదు.. తెలంగాణ ప్రజలు ఇండ్లు కావాలని అంటున్నారు.. మీరు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తారా? సింగిల్ బెడ్రూం ఇస్తారా? అనేది ప్రజలకు అనవసరం.. మీరు మంచి చేస్తే ప్రజలు మీకే ధన్యవాదాలు చెబుతారు.. 25 లక్షల మందకిపైగా ప్రజలు ఇండ్లు లేవని దరఖాస్తు చేసుకున్నారు.. అందులో ఎంతమందికి కేసీఆర్ సర్కార్ ఇండ్లు ఇస్తుందో చెప్పాలి’’ అని డిమాండ్ చేశారు.

ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి ఇళ్లు ఎక్కడా కట్టలేదని మంత్రి కేటీఆర్ చెబుతున్నారని.. యూపీలో సింగిల్ బెడ్రూం 15.70 లక్షల ఇండ్లు, మధ్యప్రదేశ్‌లో 7 లక్షల 80 వేలు, మహారాష్ట్రలో 11 లక్షల 70 వేలు, గుజరాత్‌లో 6 లక్షల 40 వేలు, హర్యానా 2 లక్షల 65 వేలు, అస్సాంలో 1 లక్ష 55 వేల ఇండ్లు కట్టించి ఇచ్చారని రాజాసింగ్ తెలిపారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల సంగతి పక్కన పెడితే.. సింగిల్ బెడ్రూమ్ ఇండ్లు అయినా ఇవ్వాలని ప్రజలు మొత్తుకుంటున్నారన్నారు. తెలంగాణలో షోప్ టాప్ తప్పితే.. ఇండ్లు కూడా ఇవ్వడంలేదని.. కట్టి వదిలేస్తున్నారని విమర్శించారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మీరు ఎన్ని కడుతారో కట్టి ఇవ్వండి.. దాంతో పాటు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద సింగిల్ బెడ్రూమ్ ఇండ్లయినా కట్టించి ఇవ్వాలని రాజాసింగ్ విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2023-09-21T15:34:27+05:30 IST