MLC KAVITHA: పార్లమెంట్‌లో మహిళ బిల్లుకు మద్దతిస్తాం

ABN , First Publish Date - 2023-09-18T23:33:27+05:30 IST

పార్లమెంట్‌(Parliament)లో మహిళ బిల్లుకు బీఆర్ఎస్ ప్రభుత్వం మద్దతు ఇస్తుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC KAVITHA) వ్యాఖ్యానించారు. సోమవారం నాడు ఆమె క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. మహిళా రిజర్వేషన్ బిల్లు(Women's Reservation Bill)కు కేబినెట్ ఆమోదం తెలపడాన్ని స్వాగతిస్తున్నామని కవిత తెలిపారు.

MLC  KAVITHA:  పార్లమెంట్‌లో మహిళ బిల్లుకు మద్దతిస్తాం

హైదరాబాద్: పార్లమెంట్‌(Parliament)లో మహిళా రిజర్వేషన్ బిల్లు(Women's Reservation Bill)కు బీఆర్ఎస్ ప్రభుత్వం మద్దతు ఇస్తుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC KAVITHA) వ్యాఖ్యానించారు. మహిళ బిల్లుకు కేంద్రం అమోదంపై ఆమె నివాసం వద్ద మహిళలతో కలిసి బాణా సంచా కాల్చి సంబురాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడుతూ.. మహిళా రిజర్వేషన్ బిల్లు(Women's Reservation Bill)కు కేబినెట్ ఆమోదం తెలపడాన్ని స్వాగతిస్తున్నాం.కనీసం ఇప్పుడైనా మోదీ ప్రభుత్వం బిల్లు పెడుతున్నందుకు సంతోషంగా ఉంది. కేంద్రం పారదర్శకంగా ఉండాలి, దీనిని దాయల్సిన అవసరం లేదు. మహిళా బిల్లుపై కేంద్ర మంత్రి వర్గం ఆమోదించినట్లు ప్రసార మాధ్యమాలతో పాటు కేంద్ర మంత్రి ట్విట్ చేశారు. ఏ బిల్లు పాస్ చేస్తారన్న దానిపై ఇంకా స్పష్టత లేదు. కేంద్ర కేబినెట్ ఒక మంచి నిర్ణయం తీసుకుంది. అధికారంలో సగం కావాలన్న మహిళల కల సాకారం కాబోతుంది.మహిళలందరికీ శుభాకాంక్షలు.ఎప్పుడూ మహిళా బిల్లు పార్లమెంట్‌లో పెట్టిన ఏదో ఒక ప్రతిపక్ష పార్టీ అడ్డుపడుతుంది.

ఎలాంటి పరిస్థితుల్లో ఈ బిల్లును కేంద్రం తీసుకువస్తుంది.. విధి విధానాలపైన స్పష్టత ఇవ్వాలి.ప్రభుత్వం వేస్తున్న ముందడగు అభినందనీయం.బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అసెంబ్లీలో మహిళలకు 33శాతం రిజర్వేషన్, ఓబీసీ రిజర్వేష్లన్లపై ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపాం.తొమ్మిదేళ్ల జాప్యం తర్వాత మహిళా బిల్లుపై కేంద్రం నిర్ణయం తీసుకుంటుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఓబీసీ, మహిళా రిజర్వేషన్లపై ఇటీవల ప్రధాని మోదీకీ లేఖలు రాశారు. కాంగ్రెస్ సీడబ్ల్యూసీ సమావేశాల్లో మహిళా బిల్లుపై రిజల్యూషన్ పాస్ చేసిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు.

కాగా.. దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం సాయంత్రం ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. దాదాపు రెండు గంటల పాటు జరిగిన ఈ భేటీలో.. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడంతో పాటు మహిళా రిజర్వేషన్ బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రేపు (మంగళవారం) మధ్యాహ్నం కొత్త పార్లమెంట్ భవనంలో ప్రారంభం కాబోయే సమావేశాల్లో.. ఈ తొలి బిల్లుని ప్రవేశపెట్టనున్నారు. ఒకవేళ ఈ బిల్లు ఆమోదం పొందితే.. పార్లమెంట్, రాష్ట్ర అసెంబ్లీలలో మహిళలకు 33 రిజర్వేషన్ కల్పించడానికి వీలవుతుంది. దీంతో పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న మరికొన్ని బిల్లులకు సైతం కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని సమాచారం.

Updated Date - 2023-09-18T23:36:04+05:30 IST