MP Arvind: కేసీఆర్ గద్దెనెక్కడంలో నా పాపం కూడా ఉంది

ABN , First Publish Date - 2023-09-13T16:51:00+05:30 IST

హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్ని సీట్లు వచ్చినా... తెలంగాణలో బీజేపీదే అధికారమని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. ఈ సందర్భంగా బుధవారం ఇందిరాపార్క్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ గద్దెనెక్కడంలో తన పాపం కూడా ఉందన్నారు.

MP Arvind: కేసీఆర్ గద్దెనెక్కడంలో నా పాపం కూడా ఉంది

హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్ని సీట్లు వచ్చినా... తెలంగాణ (Telangana)లో బీజేపీ (BJP)దే అధికారమని నిజామాబాద్ ఎంపీ (MP) ధర్మపురి అర్వింద్ (Dharmapuri Arvind) అన్నారు. ఈ సందర్భంగా బుధవారం ఇందిరాపార్క్ (Indira Park) వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ (KCR) గద్దెనెక్కడంలో తన పాపం కూడా ఉందన్నారు. ‘‘2004లో టీఆర్ఎస్‌ (TRS)కు మా నాయన రెండో మూడో సీట్లు ఇస్తే బాగుండేది.. కానీ ఎక్కువ సీట్లు ఇచ్చి టీఆర్ఎస్‌ను బతికించిండు.. అప్పుడు నేను కూడా మా నాయనకు సహకరించిన... కేసీఆర్ అధికారంలో ఉన్నరంటే నా పాపం కూడా ఉందని చెప్తున్న’’ అని అన్నారు. ఆ పాపం పోగొట్టుకోవడానికి కవితనను ఓడించానన్నారు.

ఈసారి కవిత (Kavitha) తన మీద గెలుచుడు కాదని.. మూడో ప్లేస్‌కు వెళుతుందని ధర్మపురి అర్వింద్ అన్నారు. కేసీఆర్‌ను ఓడ గొట్టేందుకు బీజేపీలో తానే ముందు నడుస్తున్నానని, కిషన్ రెడ్డి (Kishan Reddy) నాయకత్వంలో బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీకి ఎన్ని సీట్లు వచ్చినా.. బీజేపీయే అధికారంలోకి వస్తుందని మరోసారి స్పష్టం చేశారు. అందుకే కిషన్ రెడ్డికి జాతీయ నాయకత్వం అధ్యక్ష పదవి కట్టబెట్టిందని ధర్మపురి అర్వింద్ వ్యాఖ్యానించారు.

Updated Date - 2023-09-13T16:51:00+05:30 IST