Rajasingh: మున్సిపల్ కాంట్రాక్టర్లకు వెంటనే బిల్లులు చెల్లించాలి
ABN , First Publish Date - 2023-10-08T10:24:26+05:30 IST
హైదరాబాద్: మున్సిపల్ కాంట్రాక్టర్లకు వెంటనే బిల్లులు చెల్లించాలని గోషామహాల్ ఎమ్మెల్యే రాజసింగ్ ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ జీహెచ్ఎంసీ నిధులను బీఆర్ఎస్ నేతలు సొంతానికి వాడుకుంటున్నారని విమర్శించారు.
హైదరాబాద్: మున్సిపల్ కాంట్రాక్టర్లకు (Municipal Contractors) వెంటనే బిల్లులు (Bills) చెల్లించాలని గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (MLA Rajasingh) ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ జీహెచ్ఎంసీ (GHMC) నిధులను బీఆర్ఎస్ నేతలు (BRS Leaders) సొంతానికి వాడుకుంటున్నారని విమర్శించారు. జీహెచ్ఎంసీ నిధులను కేసీఆర్ సర్కార్ (KCR Govt.) ఎన్నికల కోసం వాడుకోవాలని ప్లాన్ చేసిందని ఆరోపించారు. జీహెచ్ఎంసీలో అభివృద్ధి పనులు చేయకుండా ఎన్నికలకు వెళ్ళితే.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రజలు తరమికొడతారన్నారు. ధనిక రాష్ట్రమని పదే పదే చెప్పే సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లు కాంట్రాక్టర్లకు బిల్లులు ఎందుకు చెల్లించటం లేదని ప్రశ్నించారు. జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్లకు నిధులు చెల్లించకపోవటం వలన నగరంలో అభివృద్ధి పనులు నిలిచిపోయాయని రాజాసింగ్ పేర్కొన్నారు.