BJP: NVSS ప్రభాకర్ 48 గంటల నిరాహార దీక్ష

ABN , First Publish Date - 2023-08-19T14:47:58+05:30 IST

హైదరాబాద్: డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎవ్వీఎస్ఎస్ ప్రభాకర్ 48 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. ఆయనకు మద్దతుగా దీక్షలో రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ పాల్గొన్నారు.

BJP: NVSS ప్రభాకర్ 48 గంటల నిరాహార దీక్ష

హైదరాబాద్: డబుల్ బెడ్రూం (Double Bedroom) ఇళ్ల కోసం ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే (Ex MLA) ఎవ్వీఎస్ఎస్ ప్రభాకర్ (NVSS Prabhakar) 48 గంటల నిరాహార దీక్ష (Hunger Strike) చేపట్టారు. ఆయనకు మద్దతుగా దీక్షలో రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ (MP Lakshman) పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ.. దశాబ్ది ఉత్సవాలు చేసుకున్నప్పటకీ పేదలకు సీఎం కేసీఆర్ (CM KCR) నిలువ నీడ కూడా లేకుండా చేశారని, ఇచ్చిన వాగ్దానం ఒక్కటైన ముఖ్యమంత్రి నెరవేర్చారా? అని ప్రశ్నించారు. డబుల్ బెడ్ రూంలపై బీజేపీ (BJP) ఉద్యమం మొదలు పెట్టిన తర్వాతే కదలిక మొదలయిందన్నారు.

ప్రధానమంత్రి ఆవాస యోజనలో యూపీలో లక్షల ఇళ్లు నిర్మాణం జరిగి పేదలకు వితరణ కూడా జరిగిందని ఎంపీ లక్ష్మణ్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ యూపీకి వస్తే.. ఆవాస యోజన ఇండ్లు చూపిస్తానని అన్నారు. కేసీఆర్ వైఫల్యాలపై ప్రజలు బుద్ది చెప్పడానికి సిద్దంగా ఉన్నారని లక్ష్మణ్ వ్యాఖ్యానించారు.

Updated Date - 2023-08-19T14:47:58+05:30 IST