Home » Lakshman
Laxman: సీఎం రేవంత్‌రెడ్డికి బీజేపీ రాజ్యసభ సభ్యులు, పార్లమెంటరీ బోర్డ్ మెంబర్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డా. లక్ష్మణ్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. మోదీని విమర్శిస్తే ఊరుకోమని హెచ్చరించారు. కేసీఆర్‌కు పట్టిన గతే.. రేవంత్‌కూ పడుతుందని మండిపడ్డారు. మోదీ తినే ఆహారాన్ని, వేసుకునే బట్టలను విమర్శిస్తారా అని ప్రశ్నించారు.
MP Lakshman: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కులగణన నివేదికపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 10 శాతం ముస్లిం బీసీలు,36 శాతం హిందూ బీసీలు అని పెట్టారని.. ఇది ఒక భారీ కుట్ర అంటూ విరుచుకుపడ్డారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకటే అని.. ముస్లిం మన్నన పొందడానికి ప్రయత్నం చేస్తున్నారన్నారు.
కాంగ్రెస్ కోతలపాలన.. ఎగవేతల ప్రభుత్వంమని, రైతు రుణ మాఫీ.. రైతు భరోసా అన్ని ఎగవేతలేనని, ఎన్నికల ముందు వరంగల్ సభలో రైతు భరోసా రూ. 15 వేలు ఇస్తామని.. ఇప్పుడు రూ. 12 వేలకు కోత పెట్టారని బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ ఆరోపించారు. మాయ మాటలు చెప్పి సీఎం రేవంత్ రెడ్డి రైతులను మోసం చేస్తున్నారని, కాంగ్రెస్ గ్యారెంటీలన్ని నీటి మూటలేనని విమర్శించారు.
కాళేశ్వరం ఎత్తిపోతలలో రూ.లక్ష కోట్లు వెచ్చించినా.. ఆ ప్రాజెక్టు వైఫల్యం ప్రజల కళ్లముందు ఉందని.. వెరసి పదేళ్లలో రాష్ట్రం రూ.8 లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు.
కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠ చూపిస్తోందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. ప్రజలకు రేవంత్ ప్రభుత్వం చుక్కలు చూపిస్తోందని మండిపడ్డారు. అడ్డగోలుగా హామీలు ఇచ్చి అటకెక్కించారని విమర్శించారు.
Telangana: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికల హ్యాంగోవర్ నుంచి బయటపడ్డట్టు లేదని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. అమెరికా పర్యటనలో దేశం, ప్రజాస్వామ్యం పట్ల భారత దేశప్రజలను అవమానించేలా వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. మోదీ, బీజేపీ వల్ల ప్రధాని కాలేదనే అక్కసుతో దేశం మీద విషం చిమ్ముతున్నారన్నారు.
కేంద్రమంత్రి పదవిపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ (Laxman) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏ బాధ్యత ఇచ్చిన నిర్వహిస్తానని స్పష్టం చేశారు.పార్టీ ఏది ఆదేశిస్తే అది నిర్వహిస్తానని అన్నారు. తాను ఎప్పుడూ రేసులో ఉండనని.. ఎవరికీ ఏం ఇవ్వాలనేది పార్టీ నిర్ణయమని అన్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో అనేక సంచలనాత్మక విషయాలు బయటపడుతున్నాయని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. అయినా కేసు వ్యవహారం పట్టనట్లు రేవంత్ రెడ్డి సర్కార్ వ్యవహరిస్తోందన్నారు. తప్పు చేస్తే జైలుకు పంపిస్తామని చెప్పిన సీఎం రేవంత్... ఇన్ని సంచలనాత్మక విషయాలు బయటకు వస్తుంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.
వారణాసి నుంచి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల బరిలో దిగారు. ఆ క్రమంలో ఆయనకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు తెలంగాణలోని బీజేపీ కీలక నేతలు వారణాసి బాట పట్టారు.
లోక్‌సభ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని.. ఎక్కడా అధికార దుర్వినియోగం జరగలేదని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Jaggareddy) అన్నారు. మంగళవారం గాంధీభవన్‌లో జగ్గారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికల్లో తాము అధికారంలో ఉన్నాం కదా అని ఎవరికి ఇబ్బంది కలిగేంచేలా ప్రవర్తించలేదని చెప్పారు.