LIVE: ప్రజాదర్బార్ ప్రారంభం.. స్వయంగా అర్జీలు స్వీకరిస్తున్న సీఎం రేవంత్
ABN , First Publish Date - 2023-12-08T10:49:19+05:30 IST
Telangana: ప్రజాభవన్‌లో ప్రజాదర్బార్ ప్రారంభమైంది. శుక్రవారం ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంతవాహనంలోనే జూబ్లీహిల్స్‌లోని నివాసం నుంచి ప్రజాభవన్‌కు చేరుకున్నారు.
హైదరాబాద్: ప్రజాభవన్‌లో ప్రజాదర్బార్ ప్రారంభమైంది. శుక్రవారం ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తన సొంతవాహనంలోనే జూబ్లీహిల్స్‌లోని నివాసం నుంచి ప్రజాభవన్‌కు చేరుకున్నారు. అనంతరం ప్రజాభవన్‌లో ప్రజాదర్బార్ మొదలైంది. సీఎం రేవంత్‌తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పాల్గొన్నారు. ప్రజల నుంచి నేరుగా అర్జీలను సీఎం రేవంత్, మంత్రులు స్వీకరిస్తున్నారు. మరోవైపు ప్రజాదర్బార్‌కు మంచి స్పందన లభిస్తోంది. రాష్ట్ర నలుమూల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఫిర్యాదులు ఇచ్చేందుకు ప్రజాభవన్‌కు భారీగా ప్రజలు చేరుకున్నారు. తమ సమస్యలు నేరుగా సీఎం దృష్టికి తీసుకెళ్తే పరిష్కారం అవుతాయని బాధితులు భావిస్తున్నారు. ప్రజాదర్బార్‌లో వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఏబీఎన్ -ఆంధ్రజ్యోతిలో ప్రజాదర్బార్ ప్రత్యక్ష ప్రసారం వీక్షించండి...