President Murmu: హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి ముర్ము
ABN , Publish Date - Dec 18 , 2023 | 08:11 PM
శీతకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) కాసేపటి క్రితమే హైదరాబాద్‌కి వచ్చారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి వచ్చారు. రాష్ట్రపతికి గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, ములుగు ఎమ్మెల్యే సీతక్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డీజీపీ రవి గుప్తా సాదర స్వాగతం పలికారు.
హైదరాబాద్: శీతకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) కాసేపటి క్రితమే హైదరాబాద్‌కి వచ్చారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి వచ్చారు. రాష్ట్రపతికి గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, ములుగు ఎమ్మెల్యే సీతక్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డీజీపీ రవి గుప్తా సాదర స్వాగతం పలికారు. బేగంపేట విమానాశ్రయం నుంచి నేరుగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి ముర్ము వెళ్లనున్నారు. ఈమేరకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరిగి ఈ నెల 23వ తేదీన ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ ఐదు రోజుల్లో రాష్ట్రపతి వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
మంగళవారం (రేపు) హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సందర్శించనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌లో పర్యటిస్తున్న నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని పోలీసు అధికారులు తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు బొల్లారం నుంచి బేగంపేట రూట్లో ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. వాహనదారులు ప్రత్యామ్నాయ రూట్లో వెళ్లాలని పోలీసులు సూచించారు.