Raghunandana Rao: మంత్రి కేటీఆర్‌కు రఘునందనరావు సవాల్

ABN , First Publish Date - 2023-02-07T14:09:15+05:30 IST

హైదరాబాద్: ఐటీఐఆర్‌పై మంత్రి కేటీఆర్‌ (Minister KTR) చర్చకు రావాలంటూ బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావు (Raghunandana Rao) సవాల్ (Challenge) చేశారు.

Raghunandana Rao: మంత్రి కేటీఆర్‌కు రఘునందనరావు సవాల్

హైదరాబాద్: ఐటీఐఆర్‌పై మంత్రి కేటీఆర్‌ (Minister KTR) చర్చకు రావాలంటూ బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావు (Raghunandana Rao) సవాల్ (Challenge) చేశారు. ఈ సందర్బంగా మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ కేంద్రం, ప్రధాని మోదీ (PM Modi)పై క్రమపద్దతిలో బీఆర్ఎస్ (BRS) దాడి చేస్తోందని మండిపడ్డారు. ఐటీఐఆర్‌ (ITIR)పై మంత్రి కేటీఆర్‌తో చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. ఐటీఐఆర్‌పై బీఆర్ఎస్ ప్రభుత్వం శ్వేత పత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఐటీఐఆర్ విషయంలో కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి తప్పు లేదని అన్నారు. ఐటీఐఆర్‌కు ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ నిధులనే కేంద్రం మంజూరు చేసిందని రఘునందనరావు పేర్కొన్నారు.

డీపీఆర్ (DPR) సమర్పించకుంటే కేంద్రం నిధులు ఎలా కేటాయిస్తోందని రఘునందనరావు ప్రశ్నించారు. తెలంగాణలో హైవేలు, రైల్వేలు అభివృద్దికి కేంద్రం కంకణం కట్టుకుందని, ఐటీఐఆర్‌పై బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రాన్ని అనవసరంగా బద్నాం చేస్తోందన్నారు. ఐటీఐఆర్ అంటే భవనాలు కాదు.. పెట్టుబడులు ఆకర్షించటానికి రోడ్లు, మెట్రో రైలును అభివృద్ధి చేయటమని అన్నారు. ఐటీఐఆర్‌ను రెండు విడతల్లో అభివృద్ధి చేయాలని ఆప్పటి భారత ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు. ఇమ్లీబన్ బస్టాప్ నుంచి ఫలకనూమ మెట్రో రాకపోవటానికి ఎంఐఎం, బీఆర్ఎస్‌లే కారణమని ఆరోపించారు. ఐటీఐఆర్ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన ఒక్క పనికూడా చేయడంలేదని ఎమ్మెల్యే రఘునందనరావు తీవ్రస్థాయిలో విమర్శించారు.

మరోవైపు దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావు హాట్ కామెంట్స్ (Hot comments) చేశారు. ఎంఐఎం (MIM) పార్టీపై కూడా విమర్శలు చేశారు. సిరిసిల్ల, సిద్ధిపేటలో తన పరపతి ఏందో వచ్చే ఎన్నికల్లో చూపిస్తానన్నారు. దమ్ముంటే దుబ్బాకకు రావాలని మంత్రి కేటీఆర్‌ (Minister KTR)కు సవాల్ చేశారు. వచ్చే ఎన్నికల్లో ఎంఐఎం 50 కాదు.. 119 సీట్లలో పోటీ చేయాలన్నారు. 15 సీట్లు గెలిచి మళ్ళీ బీఆర్ఎస్ (BRS) కింద పనిచేస్తానని అక్బర్ (Akbar) అనటం సిగ్గుచేటన్నారు. అక్బర్, కేసీఆర్ (KCR), బీహార్‌కు సంబంధించిన వ్యక్తేమో అన్న అనుమానం వస్తోందన్నారు. రాష్ట్రంలో బీహార్‌కు చెందిన అధికారులను తెలంగాణ సీఎస్ (CS), డీజీపీ (DGP)గా సీఎం కేసీఆర్ నియమించారని విమర్శించారు.

93 మంది ఐపీఎస్ బదిలీల్లో తెలంగాణ ఐపీఎస్ అధికారులకు ఒక్కరికి కూడా ప్రాధాన్యం ఉన్న పోస్టు ఇవ్వలేదని రఘునందనరావు ఆరోపించారు. తమకు అనుకూలంగా ఉన్న వారిని.. గట్టిగా మాట్లాడే విపక్షాల నేతలను అరెస్టు చేసేందుకు మంచి పోస్ట్ ఇచ్చారన్నారు. స్టీఫెన్ రవీంద్ర తెలంగాణ ఉద్యమంలో జై తెలంగాణ అన్న వారిని రబ్బరు బుల్లెట్లతో కాల్చిన వ్యక్తి అని అన్నారు. ఉద్యమ సమయంలో సీఎం కేసీఆర్ బీహార్ వ్యక్తి అని.. ఆంధ్రా వాళ్ళు అంటే కాదని తాము వాదించామన్నారు. కాని ఇప్పుడు తమకు అనుమానాలు కలుగుతున్నాయన్నారు.

తెలంగాణకు చెందిన హోం గార్డ్ నుంచి సీనియర్ ఐపీఎస్‌లు.. సీఎం కేసీఆర్ ఏం చేస్తున్నారో ఆలోచన చేయాలని రఘునందనరావు సూచించారు. జలద్రస్యంలో కేటీఆర్ లేరని, అమెరికాలో ఉద్యోగాలు చేసేవారని అన్నారు. అసెంబ్లీలో తమకు కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. తాను వకీల్ సాబ్ నే.. తెలంగాణ ఉద్యమంలో ఇబ్బందులు పడుతున్న ఉద్యమ కారుల కోసం పనిచేసిన వ్యక్తినని అన్నారు. తెలంగాణ మొత్తం ‘మా కుటుంబం అని చెప్పుకునే కేటీఆర్ ఉద్యమంలో అసువులు బాసిన అమరుల కుటుంబాలను ఎందుకు ఆదుకుంటలేరు’ అని ప్రశ్నించారు. పోలీసు కిష్టయ్య, డీఎస్పీ నళినిలు, శ్రీకాంతాచారి కుటుంబం తెలంగాణ కుటుంబం కాదా అని ఎమ్మెల్యే రఘునందనరావు నిలదీశారు.

Updated Date - 2023-02-07T14:09:19+05:30 IST