Komatireddy Rajagopal Reddy : పార్టీ మార్పు వార్తలపై స్పందించిన రాజగోపాల్ రెడ్డి
ABN , First Publish Date - 2023-06-24T14:13:51+05:30 IST
పార్టీ మార్పుపై వస్తున్న వార్తలపై బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు. ప్రస్తుతం తాను బీజేపీలోనే ఉన్నానని.. ఊహాగానాలను నమ్మవద్దని తెలిపారు. తన అభిప్రాయాన్ని పార్టీ హైకమాండ్‌కు వివరిస్తామని చెప్పారు. ఎమ్మెల్సీ కవిత విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందే అని స్పష్టం చేసిన రాజగోపాల్ రెడ్డి.. తెలంగాణ ప్రజలు కూడా ఇదే కోరుకుంటున్నారు. ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
హైదరాబాద్ : పార్టీ మార్పుపై వస్తున్న వార్తలపై బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు. ప్రస్తుతం తాను బీజేపీలోనే ఉన్నానని.. ఊహాగానాలను నమ్మవద్దని తెలిపారు. తన అభిప్రాయాన్ని పార్టీ హైకమాండ్‌కు వివరిస్తామని చెప్పారు. ఎమ్మెల్సీ కవిత విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందే అని స్పష్టం చేసిన రాజగోపాల్ రెడ్డి.. తెలంగాణ ప్రజలు కూడా ఇదే కోరుకుంటున్నారు. ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం సహకారం ఇస్తుందని.. అందులో భాగంగానే కేటీఆర్‌కు కేంద్రమంత్రుల అపాయింట్మెంట్ అన్నారు. మంత్రి కేటీఆర్‌కు కేంద్ర మంత్రులు అపాయింట్మెంట్ ఇవ్వడాన్ని భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదని రాజగోపాల్ రెడ్డి అన్నారు. తాను కాంగ్రెస్ లో చేరుతున్నట్టు మీడియా ఎక్కువ చేసి చూపిస్తోందన్నారు. ప్రధాని మోదీ, అమిత్ షా తలుచుకుంటే ఇప్పటికీ తెలంగాణలో బీజేపీని అధికారంలోకి వచ్చే అవకాశం ఉందన్నారు. కర్ణాటక ఎన్నికల తర్వాత కొంచెం ప్రజల ఆలోచనలో కొంచెం మార్పు వచ్చినట్టు కనబడుతోందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.