Share News

Revanth Reddy : పెద్ద మనిషి పాలనలో ప్రాణాలకు విలువ లేదు

ABN , First Publish Date - 2023-10-14T08:50:18+05:30 IST

గ్రూప్ 2 అభ్యర్థిని మర్రి ప్రవల్లిక (23) బలవన్మరణంపై టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ట్విటర్ వేదికగా స్పందించారు. అశోక్ నగర్‌లో ఆత్మహత్య చేసుకున్న ఆడబిడ్డ ప్రవల్లిక తరపున న్యాయం కావాలని వేల గొంతులు నినదిస్తున్నా.. సీఎం కేసీఆర్ చెవికి వినబడటం లేదని విమర్శించారు

Revanth Reddy : పెద్ద మనిషి పాలనలో ప్రాణాలకు విలువ లేదు

హైదరాబాద్ : గ్రూప్ 2 అభ్యర్థిని మర్రి ప్రవల్లిక (23) బలవన్మరణంపై టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ట్విటర్ వేదికగా స్పందించారు. అశోక్ నగర్‌లో ఆత్మహత్య చేసుకున్న ఆడబిడ్డ ప్రవల్లిక తరపున న్యాయం కావాలని వేల గొంతులు నినదిస్తున్నా.. సీఎం కేసీఆర్ చెవికి వినబడటం లేదని విమర్శించారు. ఈ పెద్దమనిషి (కేసీఆర్) పాలనలో మనుషుల ప్రాణాలకు విలువ లేదని రేవంత్ విమర్శించారు. రాక్షస పాలనలో హత్యలు, ఆత్మహత్యలు, అత్యాచారాలు తప్ప యువతకు భవిత లేదన్నారు. ప్రవల్లిక సూసైడ్ లెటర్‌ను గమనిస్తే ఇదే అర్థమవుతోందన్నారు. విద్యార్థిని ఆత్మహత్యపై ప్రభుత్వం స్పందించాలని రేవంత్ అన్నారు.

ఉపాధ్యాయ నియామక పరీక్ష డీఎస్సీతో పాటు గ్రూప్‌-2 పరీక్షకు సన్నద్ధమవుతున్న ఓ అభ్యర్థిని బలవన్మరణానికి పాల్పడింది. పోటీ పరీక్షలు వరుసగా వాయిదా పడుతుండడంతో మనస్తాపానికి గురైన ఆమె ఆత్మహత్య చేసుకుందని తోటి విద్యార్థులు చెబుతున్నారు. మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరుకు చెందిన మర్రి ప్రవల్లిక (23) చిక్కడపల్లి ఠాణా అశోక్‌నగర్‌లోని బృందావన్‌ బాలికల హాస్టల్‌లో ఉంటూ గ్రూప్స్‌నకు శిక్షణ తీసుకుంటోంది. శుక్రవారం రాత్రి ఆమె తన గదిలో ఉరి వేసుకుంది. ఈ విషయం తెలిసి అశోక్‌నగర్‌లోని హాస్టళ్లలో ఉంటూ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులు, ఓయూ విద్యార్థి, కాంగ్రెస్‌, బీజేపీ, టీజేఎస్‌ నాయకులు తరలివచ్చారు. నిమిషాల వ్యవధిలోనే చేరుకున్న వందలాది విద్యార్థులు ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, టీఎ్‌సపీఎస్సీ వైఫల్యం వల్లే పరీక్షలు వాయిదా పడుతున్నాయని మండిపడ్డారు.

Updated Date - 2023-10-14T08:50:18+05:30 IST