Revanth Reddy.. బీఆర్ఎస్, ఎంఐఎం బయట నుంచి బీజేపీకి మద్దతు: రేవంత్ రెడ్డి
ABN , First Publish Date - 2023-09-17T09:56:41+05:30 IST
హైదరాబాద్: బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు బయటనుంచి బీజేపీకి మద్దతు ఇస్తున్నాయని టీపీసీపీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. 2004లో తెలంగాణ ఇస్తానన్న గ్యారంటీనీ సోనియా గాంధీ నిలబెట్టుకున్నారని, పార్టీకి నష్టం జరిగినా ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారన్నారు.
హైదరాబాద్: బీఆర్ఎస్ (BRS), ఎంఐఎం (MIM) పార్టీలు బయట నుంచి బీజేపీ (BJP)కి మద్దతు ఇస్తున్నాయని టీపీసీపీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆరోపించారు. 2004లో తెలంగాణ ఇస్తానన్న గ్యారంటీని సోనియా గాంధీ (Sonia Gandhi) నిలబెట్టుకున్నారని, పార్టీకి నష్టం జరిగినా ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారన్నారు. ఈ రోజు సభలో ఇచ్చే గ్యారంటీలను కూడా అధికారంలోకి వచ్చిన 30 రోజుల్లో అమలు చేస్తామని స్పష్టం చేశారు. సభలోనే వర్చువల్‌గా నాలెడ్జ్ సెంటర్‌కు సోనియా భూమి పూజ చేస్తారని రేవంత్ రెడ్డి తెలిపారు.
కాగా రెండవ రోజు ఆదివారం ఉదయం తాజ్ కృష్ణ హోటల్‌లో సీడబ్ల్యూసీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు దేశంలో నిరుద్యోగం, రాజకీయ, ఆర్థిక, మణిపూర్, దేశ భూ ఆక్రమనలు తదితర అంశాలపై చర్చించారు. ప్రధాని మోదీ చెబుతున్న జమిలీ ఎన్నికలు రాజ్యాంగం, ఫెడరలిజంపై దాడిగా సీడబ్ల్యూసీ అభివర్ణించింది. ఈరోజు ఎక్స్‌టెండెడ్ సీడబ్ల్యూసీ సమావేశం జరుగుతోంది. ఈ భేటీలో ప్రధానంగా ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో అనుసరించాల్సిన ఎజెండాపై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో అనుసరించాల్సిన వ్యూహం ఖరారు చేయనున్నారు. అలాగే ఈరోజు తుక్కుగూడలో టి.కాంగ్రెస్ విజయభేరీ బహిరంగ సభ జరగనుంది. 10 లక్షల మందితో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సోనియాగాంధీ, రాహుల్, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే ఇతర ముఖ్య నేతలు హాజరవుతున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మేనిఫెస్టోను సోనియాగాంధీ విడుదల చేస్తారు. 6 హామీల గ్యారంటీ కార్డు విడుదల చేయనున్నారు.