Hyderabad: లాడ్జ్‌లో ఓ యువకుడి సెల్ఫీ వీడియో సూసైడ్..
ABN , First Publish Date - 2023-05-23T14:49:19+05:30 IST
హైదరాబాద్: బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని లాడ్జ్‌లో ఓ యువకుడి సెల్ఫీ వీడియో సూసైడ్ చేసుకున్నాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
హైదరాబాద్: బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని లాడ్జ్ (Lodge)లో ఓ యువకుడి సెల్ఫీ వీడియో సూసైడ్ (Selfie Video Suicide) చేసుకున్నాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. లైవ్ వీడియో కాల్ (Live video call)లో యువకుడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రేమ వివాహానికి ఇంట్లో కుటుంబసభ్యులు నిరాకరించడంతో 22 ఏళ్ల సాంబరాజు సూసైడ్ చేసుకున్నాడు.
ఉప్పల్‌లో ఉండే సాంబరాజు సికింద్రాబాద్‌లో ఓ జ్యువెలరీ షాప్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. తాను ప్రేమించిన యువతితో వివాహానికి కుటుంబ సభ్యులు అభ్యంతరం తెలపడంతో బేగంపేట్‌లో స్టే ఇన్ హోటల్‌లో రూమ్ బుక్ చేసుకుని... హోటల్ రూమ్ నుంచి ఇంట్లో వాళ్లకు వీడియో కాల్ చేసి తాను చనిపోతున్నానని చెప్పాడు. దీంతో కుటుంబసభ్యులు హుటాహుటిన ఉప్పల్ నుంచి బేగంపేట వచ్చి చూసేసరికి సాంబరాజు సీలింగ్‌కు వేలాడుతూ కనిపించాడు. హాస్పిటల్‌కు తరలించగా చనిపోయినట్టు డాక్టర్లు ధృవీకరించారు. సమాచారం అందుకున్న బేగంపేట్ పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.