Crime: రెండో రోజు ఎస్ఐను విచారిస్తున్న రాయదుర్గం పోలీసులు

ABN , First Publish Date - 2023-09-07T14:15:24+05:30 IST

హైదరాబాద్: డ్రగ్స్ కేసులో ఎస్ఐ రాజేంద్రను రాయదుర్గం పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ఎస్ఐను రెండు రోజులపాటు పోలీసుల కస్టడీకి కూకట్‌పల్లి కోర్టు అనుమతించింది. దీంతో రాజేందర్‌ను పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు.

 Crime: రెండో రోజు ఎస్ఐను విచారిస్తున్న రాయదుర్గం పోలీసులు

హైదరాబాద్: డ్రగ్స్ కేసు (Drugs Case)లో ఎస్ఐ రాజేంద్రను (SI Rajendra) రాయదుర్గం పోలీసులు కస్టడీ (Custody)లోకి తీసుకుని విచారిస్తున్నారు. ఎస్ఐను రెండు రోజులపాటు పోలీసుల కస్టడీకి కూకట్‌పల్లి కోర్టు (Kukatpalli Court) అనుమతించింది. దీంతో రాజేందర్‌ను పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. మొదటి రోజు బుధవారం విచారణ పూర్తయింది. రెండో రోజు గురువారం విచారణ కొనసాగుతోంది. ఈరోజు సాయంత్రంతో కస్టడీ ముగుస్తుంది.

సైబరాబాద్ క్రైమ్ ఎస్ఐగా పనిచేస్తున్న రాజేందర్ గత ఫిబ్రవరి నెలలో ముంబైయికి వెళ్లిన సమయంలో నైజేరియన్‌ను అరెస్టు చేసి హైదరాబాద్‌కు తరలించారు. నైజేరియన్ నుంచి స్వాధీనం చేసుకున్న ఒక కిలో 7వందల గ్రాముల డ్రగ్స్‌ను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లకుండా ఎస్ఐ తన ఇంట్లో పెట్టుకుని దాన్ని విక్రయించే ప్రయత్నం చేశాడు. దీంతో నార్కోటిక్ బ్యూరో పోలీసులు వలపన్ని ఎస్ఐను అరెస్టు చేశారు. అతని దగ్గర నుంచి కిలో 7వందల గ్రాముల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. కాగా ఇప్పటికే ఎస్ఐ రాజేందర్‌ను సస్పెండ్ చేస్తూ స్టీఫెన్ రవీంధ్ర ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.

Updated Date - 2023-09-07T14:15:24+05:30 IST