చంద్రబాబు విడుదల కోసం చిలుకూరు బాలాజీ దేవాలయంలో ప్రత్యేక పూజలు
ABN , First Publish Date - 2023-10-09T10:46:26+05:30 IST
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి అక్రమ అరెస్టు నుంచి త్వరగా విడుదలై మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సేవలు అందించాలని కోరుతూ చిలుకూరు బాలాజీ దేవాయంలో పలువురు పూజలు నిర్వహించారు.
హైదరాబాద్ : టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి అక్రమ అరెస్టు నుంచి త్వరగా విడుదలై మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సేవలు అందించాలని కోరుతూ చిలుకూరు బాలాజీ దేవాయంలో పలువురు పూజలు నిర్వహించారు. చేవెళ్ల టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు గూడెం సుభాష్ యాదవ్, ప్రధాన కార్యదర్శి కొమ్మిడి వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీటీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సామ భూపాల్ రెడ్డి, పరిగి చంద్రయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బేతి జగదీష్ రెడ్డి, దళిత విభాగం రాష్ట్ర అధ్యక్షులు పొలంపల్లి అశోక్, శేరిలింగంపల్లి ఇంచార్జ్ కట్టా వెంకటేష్ గౌడ్ తదితరులు పూజలో పాల్గొన్నారు. చంద్రబాబు వెంటనే విడుదల కావాలని సుప్రీంకోర్టులో న్యాయం జరిగాలని వేంకటేశ్వర స్వామిని వేడుకున్నట్టు తెలిపారు.