Supreme Court: బీఆర్‌ఎస్ ఎంపీ బీబీ పాటిల్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

ABN , First Publish Date - 2023-07-25T15:16:13+05:30 IST

బీఆర్‌ఎస్‌ ఎంపీ బీబీ పాటిల్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అనర్హత పిటిషన్ విచారణపై సుప్రీంలో బీఆర్‌ఎస్ ఎంపీకి ఊరట లభించలేదు.

Supreme Court: బీఆర్‌ఎస్ ఎంపీ బీబీ పాటిల్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

న్యూఢిల్లీ: బీఆర్‌ఎస్‌ ఎంపీ బీబీ పాటిల్‌కు (BRS MP Bibi Patil) సుప్రీంకోర్టులో (Supreme Court) ఎదురుదెబ్బ తగిలింది. అనర్హత పిటిషన్ విచారణపై సుప్రీంలో బీఆర్‌ఎస్ ఎంపీకి ఊరట లభించలేదు. అనర్హత పిటిషన్‌పై హైకోర్టులోనే తేల్చుకోవాలని స్పష్టం చేస్తూ బీబీ పాటిల్ వేసిన పిటిషన్‌ను సుప్రీం తోసిపుచ్చింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఎంపీగా బీబీ పాటిల్ గెలుపొందారు. అయితే నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినందున బీబీ పాటిల్ ఎంపిక చెల్లదంటూ కె.మదనమోహన్ రావు అనే వ్యక్తి తెలంగాణ హైకోర్టులో (Telangana High Court) పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై రోజువారీ విచారణకు హైకోర్టు ఆదేశించింది. అయితే హైకోర్టు ఆదేశాలను బీబీ పాటిల్ సుప్రీంలో సవాలు చేశారు. బీఆర్‌ఎస్ ఎంపీ పిటిషన్‌పై ఈరోజు (మంగళవారం) సుప్రీంలో విచారణకు రాగా.. బీబీ పాటిల్ వాదనల్లో మెరిట్స్ లేనందున పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చుతూ తీర్పునిచ్చింది.

Updated Date - 2023-07-25T15:16:13+05:30 IST