TS Congress: కాంగ్రెస్ నుంచి కొత్త మనోహర్ రెడ్డి సస్పెన్షన్

ABN , First Publish Date - 2023-09-27T16:11:21+05:30 IST

కాంగ్రెస్ నేత కొత్త మనోహర్ రెడ్డి‌పై వేటు పడింది. కాంగ్రెస్ నుంచి కొత్త మనోహర్ రెడ్డిని సస్పెండ్ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని మనోహర్ రెడ్డిపై

TS Congress:  కాంగ్రెస్ నుంచి కొత్త మనోహర్ రెడ్డి సస్పెన్షన్

హైదరాబాద్: కాంగ్రెస్ నేత కొత్త మనోహర్ రెడ్డి‌పై వేటు పడింది. కాంగ్రెస్ నుంచి కొత్త మనోహర్ రెడ్డిని సస్పెండ్ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని మనోహర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు వేసింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు కొత్త మనోహర్ రెడ్డి పార్టీలోకి వచ్చారు. కొత్త మనోహర్ రెడ్డి మహేశ్వరం టికెట్ ఆశిస్తున్నారు. అయితే పార్టీలో టికెట్లు అమ్ముకుంటున్నారని పార్టీ ముఖ్య నేతలపై కొత్త మనోహర్ రెడ్డి ఆరోపణలు చేశారు. దీంతో ఆయనపై కాంగ్రెస్ చర్యలు తీసుకుంది.

Updated Date - 2023-09-27T16:11:21+05:30 IST