Bhatti Vikramarka: షర్మిల కాంగ్రెస్‌లోకి రావడంపై భట్టి ఏమన్నారంటే..!
ABN , First Publish Date - 2023-09-01T14:33:00+05:30 IST
నిన్న వైఎస్సాఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల.. ఢిల్లీలో సోనియా, రాహుల్‌ను కలిశారు. పార్టీ విలీనంపై చర్చించినట్లు తెలుస్తోంది. రెండు, మూడు రోజుల్లో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే షర్మిల రాకను రేవంత్‌రెడ్డి వర్గం
తిరుమల: వైఎస్సాఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల (sharmila) కాంగ్రెస్‌లోకి రావడంపై తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) స్పందించారు. వైఎస్.రాజశేఖర్‌రెడ్డి కుమార్తెగా షర్మిల తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి రాబోతున్నారని భట్టి వ్యాఖ్యానించారు. షర్మిల రాకను భట్టి స్వాగతించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. ‘‘రాబోవు ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి ప్రజా ప్రభుత్వాని ఏర్పాటు చేస్తుంది. తెలంగాణ అభివృద్ధి చెందాలని కాంగ్రెస్ పార్టీ తెలంగాణని ఏర్పాటు చేసింది. దశాబ్ద కాలంగా తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దేశంలో ఉచిత కరెంట్‌ను ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తాం. బీఆర్ఎస్.. బీజేపీకి బీ టీం. తెలంగాణలో అధికారాన్ని కోల్పోతున్నారు. ఇక బీఆర్ఎస్ వల్ల ఒరిగేది ఏమి లేదు.’’ అని భట్టి విక్రమార్క అభిప్రాయపడ్డారు.
నిన్న వైఎస్సాఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల.. ఢిల్లీలో సోనియా, రాహుల్‌ను కలిశారు. పార్టీ విలీనంపై చర్చించినట్లు తెలుస్తోంది. రెండు, మూడు రోజుల్లో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే షర్మిల రాకను రేవంత్‌రెడ్డి వర్గం (Revanth Reddy) తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. మరో వర్గం స్వాగతిస్తోంది. ఇలా తెలంగాణ కాంగ్రెస్‌లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ హైకమాండ్ మాత్రం షర్మిలకు సముచిత స్థానం కల్పిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు తుమ్మల నాగేశ్వర్‌రావును పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి కలిసి పార్టీలోకి ఆహ్వానించారు. తుమ్మల పాలేరు టికెట్‌ను ఆశిస్తున్నారు. ఇదే పాలేరు టికెట్‌ను షర్మిల కూడా ఆశిస్తున్నారు. షర్మిల పార్టీ కాంగ్రెస్ విలీనం అవుతుందా? తుమ్మల కాంగ్రెస్‌లో చేరతారా? లేదా? ఈ సందిగ్ధం వీడాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.