Hyd Fire Accident: నాంపల్లి అగ్నిప్రమాద మృతుల కుటుంబసభ్యులకు ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా
ABN , First Publish Date - 2023-11-13T14:08:21+05:30 IST
నాంపల్లి బజార్‌ఘాట్ అగ్నిప్రమాద మృతుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చెప్పున ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు.
హైదరాబాద్: నాంపల్లి బజార్‌ఘాట్ అగ్నిప్రమాద (Nampally Fire Accident) మృతుల కుటుంబాల తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) ఎక్స్‌గ్రేషియా (Exgratia) ప్రకటించింది. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చెప్పున ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ (Minister KTR) ప్రకటించారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav) ఘటనా స్థలికి చేరుకున్నారు. అక్కడి పరిస్థితిని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటిస్తున్నట్లు మంత్రి తెలిపారు. అలాగే గాయపడిన క్షతగాత్రులకు ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నామన్నారు. మెరుగైన వైద్యం కోసం అవసరమైతే ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలిస్తామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.