TS Assembly: స్పీకర్ గడ్డం ప్రసాద్ గురించి మంత్రుల మాటల్లో...
ABN , Publish Date - Dec 14 , 2023 | 11:49 AM
Telangana: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ కుమార్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సభలో స్పీకర్‌కు ధన్యవాద తీర్మానంపై మంత్రులు మాట్లాడుతూ స్పీకర్ గడ్డం ప్రసాద్ గురించిన విషయాలను సభకు తెలియజేశారు.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ కుమార్ (TS Assembly Speaker Gaddam Prasad kumar) ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సభలో స్పీకర్‌కు ధన్యవాద తీర్మానంపై మంత్రులు మాట్లాడుతూ స్పీకర్ గడ్డం ప్రసాద్ గురించిన విషయాలను సభకు తెలియజేశారు. ముందుగా స్పీకర్‌గా ఎన్నికైన గడ్డం ప్రసాద్‌కు అభినందనలు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
(Deputy CM Bhatti Vikramarka) మాట్లాడుతూ.. స్పీకర్‌గా ఎన్నికైన గడ్డం ప్రసాద్ కుమార్‌కు అభినందనలు తెలియజేశారు. పేద వాళ్ళ సమస్యలు తెలిసిన వ్యక్తి ప్రసాద్ కుమార్ అన్నారు. రాష్ట్రంలోని సమస్యలను పెద్ద ఎత్తున చర్చించేందుకు సభ్యులకు ఎక్కువ సమయం ఇస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. శాసనసభలో చర్చలు అర్థవంతంగా నడుపుతారని విశ్వసిస్తున్నానన్నారు.
శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridhar babu) మాట్లాడుతూ.. అంచెలంచెలుగా ఎదిగి ఈ రోజు స్పీకర్‌గా ఎన్నికైన గడ్డం ప్రసాద్ కుమార్‌కు అభినందనలు తెలిపారు. శాసనసభలో మంచి సంప్రదాయాన్ని ఏర్పాటు చేస్తారని స్పీకర్ పై పూర్తి నమ్మకం ఉందన్నారు. స్పీకర్‌కు మద్దతు తెలిపినందుకు విపక్ష పార్టీలకు ధన్యవాదాలు తెలిపారు. స్పీకర్ నిర్ణయాలకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. తన తండ్రి శ్రీపాద రావు కూడా ఇదే శాసనసభలో పని చేసి ఆ చైర్‌కు ఔన్నత్యాన్ని తీసుకొచ్చారని మంత్రి శ్రీధర్‌బాబు గుర్తుచేశారు.