TS News: ప్రభుత్వంపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-04-02T18:18:47+05:30 IST

తెలంగాణ (Telangana) ప్రభుత్వంపై బీజేపీ (BJP) రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) సంచలన వ్యాఖ్యలు చేశారు.

TS News: ప్రభుత్వంపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

ములుగు: తెలంగాణ (Telangana) ప్రభుత్వంపై బీజేపీ (BJP) రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘హిందువుల పండుగ వేళల్లో షాపులు మూసేస్తారా?, ఇతరుల పండుగలకు మాత్రం తెల్లవార్లు షాపులు తెరిచినా పట్టించుకోరా?, రంజాన్ సమయంలో పాతబస్తీలో డ్రంకన్ డ్రైవ్ ఎందుకు చేయడం లేదు?, తెలంగాణలో హిందువులకో న్యాయం? ఇతరులకో మరో న్యాయమా?, పాకిస్తాన్ గెలిస్తే సంబురాలు చేసుకునే బీఆర్ఎస్ (BRS) వంటి పార్టీలు అవసరమా?, 80 శాతం హిందువులున్న దేశంలో రామ మందిరం కోసం బలిదానాలు చేయాల్సి రావడమా?’’ అని ఘాటుగా ప్రశ్నించారు. ములుగు బూత్ కమిటీ సభ్యుల సమ్మేళనంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఫైర్ అయ్యారు. కేసీఆర్ సర్కార్ తీరుపై తీవ్రస్థాయిలో బండి సంజయ్ ధ్వజమెత్తారు.

Updated Date - 2023-04-02T18:18:47+05:30 IST