AP News: వైఎస్ ఎన్ని సెంచరీలు కొట్టారని..: టీడీపీ నేత

ABN , First Publish Date - 2023-05-06T19:00:11+05:30 IST

అకాల వర్షాలకు పంట దెబ్బ తిన్నదని, ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని తీర్మానం చేశామని టీడీపీ (TDP) నేత రావుల చంద్రశేఖరరెడ్డి (Ravula Chandra Shekar Reddy) తెలిపారు.

AP News: వైఎస్ ఎన్ని సెంచరీలు కొట్టారని..: టీడీపీ నేత

హైదరాబాద్: అకాల వర్షాలకు పంట దెబ్బ తిన్నదని, ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని తీర్మానం చేశామని టీడీపీ (TDP) నేత రావుల చంద్రశేఖరరెడ్డి (Ravula Chandra Shekar Reddy) తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కర్ఫ్యూ ఉన్న నగరాన్ని.... కరోనా వ్యాక్సిన్ కనుగొనే స్థాయికి చంద్రబాబు నాయుడు తెచ్చారని పేర్కొన్నారు. 60 శాతం ఆదాయం హైదరాబాద్ నుండి ప్రభుత్వానికి వస్తోందంటే కారణం టీడీపీ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాసాని జ్ఞానేశ్వర్ ఆధ్వర్యంలో నూతన ఉత్తేజం వచ్చిందని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ‘‘రాజకీయాల్లో పెనుమార్పులు తెచ్చారు NTR, దేశంలో‌నే తొలిసారిగా వృద్ధాప్య పింఛన్లు ఇచ్చింది NTR హయాంలోనే, ఏపీ‌లో ఉన్న NTR హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చి YSR పేరు పెట్టారు, ఏమన్నా అంటే వైఎస్ డాక్టర్ కాబట్టి పేరు మార్చాం అన్నారు, మరి ఎన్ని సెంచరీలు కొట్టారని విశాఖ స్టేడియం‌కు వైఎస్ పేరు పెట్టారు?’’ అని ఆయన ప్రశ్నించారు. కార్వన్ టీడీపీ అభ్యర్థి బండారు వెంకటేష్‌ను మంచి మెజార్టీతో గెలిపించాలని డిమాండ్ చేశారు.

Updated Date - 2023-05-06T19:00:11+05:30 IST